8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత.. స్పెషల్ జాబితాలో చోటు.. ఎవరంటే?

Nepal Bowler: 16 ఏళ్ల బౌలర్ సంచలనం సృష్టించాడు. కేవలం 8 రోజుల్లో 6 వన్డే మ్యాచ్‌లు ఆడి ఏకంగా 12 వికెట్లతో చెలరేగిపోయాడు. అయితే, ఇలాంటి స్పెషల్ ప్రదర్శన చేసినా.. ఈ బౌలర్ టీం ఫైనల్ చేరలేకపోయింది. అందుకు కారణం బ్యాటర్లు.

8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత.. స్పెషల్ జాబితాలో చోటు.. ఎవరంటే?
Wicket
Follow us

|

Updated on: Nov 05, 2024 | 5:04 PM

నేపాల్‌లో జరుగుతున్న అండర్-19 టోర్నమెంట్‌లో 16 ఏళ్ల బౌలర్ ఎనిమిది రోజుల్లో ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడి వికెట్ల వర్షం కురిపించి సంచలనం సృష్టించాడు. నరేష్ శ్రేష్ఠ మెమోరియల్ అండర్ 19 పురుషుల టోర్నమెంట్‌లో కర్నాలీ జట్టు తరపున ఆడుతున్న బిపిన్ శర్మ ఈ ఘనత సాధించాడు. అతను ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అతను 12.08 సగటుతో, 3.11 ఎకానమీతో వికెట్లు తీశాడు. 10 పరుగులకే నాలుగు వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన ఉన్నా.. అతని జట్టు పరిస్థితి విషమంగా ఉంది. ఆరింటిలో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఏడు జట్లలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఈ జట్టు ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.

బిపిన్ శర్మ తన జట్టు కోసం అక్టోబర్ 29, నవంబర్ 5 మధ్య వరుసగా ఆరు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో ఎస్పీ అండర్ 19 జట్టుపై 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత, అతను లుంబినీపై 24 పరుగులకు ఒక వికెట్, కెపిపై 43 పరుగులకు ఒక వికెట్, గండకిపై ఒక వికెట్, మాధేష్పై నాలుగు, బాగ్మతిపై నాలుగు వికెట్లు తీశాడు. బిపిన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.

బ్యాటింగ్‌లో విఫలమైన కర్నాలీ జట్టు..

బిపిన్ లెఫ్ట్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా కర్నాలీ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో 99 పరుగులు, మూడో మ్యాచ్‌లో 85 పరుగులు, నాలుగో 101 పరుగులు, ఐదో మ్యాచ్‌లో 133 పరుగులు, ఆరో మ్యాచ్‌లో 75 పరుగులకే పరిమితమైంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో బిపిన్ శర్మ స్ట్రాంగ్ బౌలింగ్‌తో కర్నాలీ విజయం సాధించింది.

ఈ టోర్నీ ఫైనల్ నవంబర్ 6న ఎస్పీ, కేపీ జట్ల మధ్య జరగనుంది. ఇరుజట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే