Watch Video: కరాచీ ఉగ్రదాడితో.. పీఎస్ఎల్‌లో భయాందోళనలు.. స్టేడియంలోనే ఆటగాళ్లు.. వీడియో వైరల్..

|

Feb 18, 2023 | 5:19 AM

Viral Video: పాకిస్థాన్ సూపర్ లీగ్ జట్టు స్టేడియంలోనే ఆగిపోయింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లలో భయాందోళనలు నెలకొన్నాయి.

Watch Video: కరాచీ ఉగ్రదాడితో.. పీఎస్ఎల్‌లో భయాందోళనలు.. స్టేడియంలోనే ఆటగాళ్లు.. వీడియో వైరల్..
Pakistan Viral Video
Follow us on

Karachi Police Head Quarter Attack, PSL: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఉగ్రవాదులు పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల సంఖ్య 10కి పైగానే ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా బహుళ అంతస్తుల భవనంలోకి ఉగ్రవాదులు కూడా ప్రవేశించి, కాల్పులు జరిపారు. అయితే పాకిస్థాన్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. సమాచారం ప్రకారం, పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు ఉగ్రవాదుల దాడి జరిగిన సమీపంలోని హోటల్‌లో బస చేయడంతో ఆ జట్టు ఆటగాళ్లలో భయాందోళన వాతావరణం నెలకొంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఉగ్రవాదులు పోలీసు యూనిఫాంలో ఉన్నారని, అందుకే వారిని గుర్తించలేక పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారని చెబుతున్నారు. ప్రస్తుతం స్టేడియంలో ఇరుక్కున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ జట్టు ఆటగాళ్లలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను వైరల్ చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు పోలీసు ప్రధాన కార్యాలయం వెనుక నుంచి గ్రెనేడ్లు విసిరారు. తరువాత వారు నాలుగు అంతస్తుల భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దుండగులు బాంబ్ పేల్చి, కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు చీఫ్ కార్యాలయంలో సిబ్బంది ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..