భారత్‌ VS శ్రీలంక మ్యాచ్: ఆకాశంలో ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ బ్యానర్‌తో విమాన సంచారం

|

Jul 06, 2019 | 8:31 PM

వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ అనే  స్టోగన్‌ గల బ్యానర్‌తో ఒక విమానం స్టేడియం మీదుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ప్రపంచకప్  టోర్నీ మొదలైనప్పటి నుంచీ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. వీటిపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఐసీసీ స్పందించింది. ప్రపంచకప్  టోర్నీల వద్ద ఇలాంటి రాజకీయ సందేశాల్ని ఎట్టి పరిస్థితిలోనూ […]

భారత్‌ VS శ్రీలంక మ్యాచ్: ఆకాశంలో జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ బ్యానర్‌తో విమాన సంచారం
Follow us on

వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ అనే  స్టోగన్‌ గల బ్యానర్‌తో ఒక విమానం స్టేడియం మీదుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ప్రపంచకప్  టోర్నీ మొదలైనప్పటి నుంచీ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. వీటిపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

దీనిపై ఐసీసీ స్పందించింది. ప్రపంచకప్  టోర్నీల వద్ద ఇలాంటి రాజకీయ సందేశాల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది.  తాజా ఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కాగా జూన్‌ 29న పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుండగా ‘జస్టిస్‌ ఫర్‌ బలోచిస్థాన్‌’ అనే నినాదంతో స్టేడియంపై విమానం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా రెండు దేశాల అభిమానుల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి..ఘర్షణ వరకు దారితీసింది.