
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20ల మ్యాచ్‌లో జోస్ బట్లర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల వర్షం కురిపించాడు. ఒకదాని తర్వాత ఒకటి ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆతిథ్య వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనింగ్ జోడీ ఫలించకపోవడంతో కెప్టెన్ జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
బట్లర్ 32 బంతుల్లో తన 24వ T20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత 45 బంతుల్లో 83 పరుగులకు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అతని బ్యాట్ నుంచి మొత్తం 9 ఫోర్లు, 6 సిక్సర్లు వచ్చాయి. జోస్ బట్లర్ ఆరో ఓవర్ నాలుగో బంతికి మ్యాచ్‌లో తొలి సిక్స్ బాదాడు. కానీ 9వ ఓవర్ మూడో బంతికి అతడు కొట్టిన రెండో సిక్స్ అద్భుతం అని చెప్పాలి. ఆ సిక్స్ చాలా ఎత్తుకు వెళ్లింది, స్టేడియమే చిన్నదిగా అనిపించింది. వెస్టిండీస్ స్పిన్నర్ మోతీపై బట్లర్ ఈ సిక్స్ కొట్టాడు.
బట్లర్ కొట్టిన 115 మీటర్ల సిక్స్‌కి బంతి గాలిలో ఎగిరి నేరుగా స్టేడియం పైకప్పుపై పడింది. ఆ తర్వాత బట్లర్ మరో 4 సిక్సర్లు బాదాడు.ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌ను వరుసగా రెండవ టీ20లో కూడా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం బట్లర్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
115 METRE SIX 🤯
Buttler hits one out of the ground and he is cooking! pic.twitter.com/Dho5NpVKIZ
— Cricket on TNT Sports (@cricketontnt) November 10, 2024