85 నిమిషాల తుఫాన్ ఇన్నింగ్స్.. 11 సిక్సర్లు, 5 ఫోర్లతో బౌలర్ల ఊచకోత.. సీన్ కట్ చేస్తే!

|

Feb 02, 2023 | 1:41 PM

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన ఖుల్నా టైగర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో..

85 నిమిషాల తుఫాన్ ఇన్నింగ్స్.. 11 సిక్సర్లు, 5 ఫోర్లతో బౌలర్ల ఊచకోత.. సీన్ కట్ చేస్తే!
Cricket
Follow us on

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన ఖుల్నా టైగర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, ఖుల్నా టైగర్స్ బ్యాట్స్‌మెన్ 11 ఫోర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కొమిల్లా విక్టోరియన్స్ బ్యాట్స్‌మెన్ 11 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు కావడమే కాకుండా బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.

కొమిల్లా విక్టోరియన్స్ తరఫున 11 సిక్సర్లు బాదిన ఈ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించాడు. టీ20లో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. దీంతో ఖుల్నా టైగర్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మరి తుఫాను సెంచరీతో చెలరేగిన ఆ బ్యాటర్ మరెవరో కాదు జాన్సన్ చార్లెస్.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌కు చెందిన ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ చార్లెస్ కొమిల్లా విక్టోరియన్స్ తరపున కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 10 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీకి చేరుకున్నాడు. మొత్తం 85 నిమిషాల బ్యాటింగ్‌తో 56 బంతులు ఎదుర్కొని 107 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ 95 పరుగులు, కెప్టెన్ షాయ్ హోప్ 91 పరుగులు సాధించి.. జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు 211 పరుగుల లక్ష్యాన్ని కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో ఛేదించింది. విక్టోరియన్స్ తరఫున జాన్సన్ చార్లెస్ సెంచరీ చేశాడు. అతడితో పాటు పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ కూడా 73 పరుగుల చేసి మంచి సహకారాన్ని అందించాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..