Viral: హోటల్ కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు.. భయం.. భయంగా.. వర్కర్లు ఏంటని చూడగా..

ఆ హోటల్‌లోని వంట గదిలో వర్కర్లు చకచకగా పనులు పూర్తి చేస్తున్నారు. ఈలోపు వాళ్లందరికీ వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి.

Viral: హోటల్ కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు.. భయం.. భయంగా.. వర్కర్లు ఏంటని చూడగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2023 | 10:05 AM

ఆ హోటల్‌లోని వంట గదిలో వర్కర్లు చకచకగా పనులు పూర్తి చేస్తున్నారు. ఈలోపు వాళ్లందరికీ వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ముందుగా వారు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి పెద్దగా రావడం మొదలవటంతో ఏంటని చుట్టూ చూడగా.. వారికి ఓ చోట దాదాపుగా 5 అడుగుల పొడవున్న నాగుపాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా వర్కర్లు హడలిపోయి అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తిరువళ్ళూరు జిల్లాలోని తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వంటగదిలోకి 5 అడుగుల పొడవైన నాగుపాము దూరింది. అక్కడ పని చేస్తోన్న సిబ్బంది దాన్ని గుర్తించడంతో ఒక్కసారిగా కస్టమర్లలో భయం నెలకొంది. ఠక్కున హోటల్ నుంచి పరుగులు తీశారు. అయితే వెంటనే హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు ఘటనాస్థలికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.