Sanjana Ganesan: ‘ఈ డక్స్ అద్భుతంగా ఉన్నాయి’.. ఇంగ్లండ్ బ్యాటర్లపై అదిరిపోయే పంచులేసిన బుమ్రా సతీమణి.. వీడియో వైరల్..
IND vs ENG: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మొత్తం 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమేజజ
IND vs ENG: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మొత్తం 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. జేసన్ రాయ్, జో రూట్, లియామ్ లివింగ్‌స్టోన్.. వంటి స్టార్ ఆటగాళ్లు బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇక జానీ బెయిర్‌స్టో, విల్లే, బ్రైడన్ కార్స్ కూడా బుమ్రా భీకర బౌలింగ్‌కు బలయ్యారు. అందుకే ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కూడా ఈ స్పీడ్‌స్టర్‌కే దక్కింది. కాగా బుమ్రా బౌలింగ్‌పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బుమ్రా సతీమణి, సంజనా గణేషన్ (Sanjana Ganesan) అయితే ఆనందంలో మునిగితేలుతంది. ఓ ప్రముఖ క్రీడా ఛానెల్‌కు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి లండన్‌లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా మొదటి వన్డే మ్యాచ్ గురించి మాట్లాడిన సంజన ఇంగ్లండ్ బ్యాటర్లపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,
— Sony Sports Network (@SonySportsNetwk) July 12, 2022
కాగా లండన్ వీధుల్లో ఓ ఫుడ్ ఏరియాకు వెళ్లిన సంజన.. ‘సాధారణంగా ఇది బిజీ ఏరియా. నిజానికి ఇక్కడ ఇంగ్లండ్ అభిమానులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మ్యాచ్ చూడడం బహుశా ఇష్టం లేదనుకుంటా! ఇక్కడ హాట్ డాగ్స్.. ఇంకా ఇతరత్రా ఆహార పదార్థాలు ఉన్నాయి. మేమైతే ఇక్కడి స్టాల్స్‌ను సందర్శిస్తున్నాం. కానీ చాలా మంది ఇంగ్లండ్ బ్యాటర్లు ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. దీనిని క్రిస్పీ డక్ అంటారు. మైదానం వెలుపల డక్స్ ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఎలాగూ మైదానంలో డక్స్ అద్భుతంగా ఉంటాయి కదా ‘ అని సరదాగా చెప్పుకొచ్చింది సంజన.
???? ???? posed a lot of questions, but the English batters didn’t have answers ?