ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకుంటూ గతేడాది మార్చి 15న గోవాలో పెళ్లిపీటలెక్కారు టీమిండియా పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా- సంజనా గణేషన్. అప్పటి నుంచి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ రోజురోజుకూ తమ దాంపత్య బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీబిజీగా గడిపే ఈ లవ్లీ కపుల్ ఏమాత్రం తీరికచిక్కినా ఇద్దరూ కలిసి ఒక్కచోట చేరి సమయాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు తమ తమ వెకేషన్, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. అలా తాజాగా తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని (Wedding Anniversary) పురస్కరించుకుని ఓ అద్భుతమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). ఈ సందర్భంగా తమ పెళ్లినాటి వీడియోను మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఐలవ్యూ’ అంటూ తన సతీమణికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపాడు.
నీతోనే ఉండాలని..
‘మనిద్దరం కలిసుంటే జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు నా వెంట ఉంటే సంతోషం. నన్ను శాంత మూర్తిగా, మరింత దయార్థ్ర హృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. ఇద్దరం కలిసి మన జీవితాలను మరింత అర్ధవంతంగా మార్చుకున్నాం. మన ప్రయాణంలో ఏడాది కాలం అనేది చాలా చిన్నదే కావచ్చు. అయితే ఏ చిన్న విరామం దొరికినా నేను నీ సమక్షంలోనే గడపాలని కోరుకుంటాను’ అని ఈ సందర్భంగా తన సతీమణిపై ప్రేమను కురిపించాడు బుమ్రా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటాడు బుమ్రా. టీమిండియా టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్-2022 టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రికెట్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మార్చి 26 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
Also Read: TS Government: గంజాయి సాగు రైతులపై సర్కార్ కొరడా.. జూన్ నుంచి రైతుబంధు నిధులు కట్..
Kerala News: ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా అక్కడ బాయ్ కాట్.. అదేంటో మీరూ తెలుసుకోండి..
Holi 2022: పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారా ? హోలీ రోజున ఈ పరిహారాలు చేస్తే అంతా శుభమే..