ఈ ఆటగాడిని రోహిత్, పంత్ వారి జట్టు నుంచి తొలగించారు..! కానీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంది.. ఎందుకో తెలుసా..?

IPL 2021: ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు నుంచి తొలగించాడు. తరువాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జట్టు నుంచి తొలగించాడు.

ఈ ఆటగాడిని రోహిత్, పంత్ వారి జట్టు నుంచి తొలగించారు..! కానీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంది.. ఎందుకో తెలుసా..?
Jagadeesha Suchith
Follow us
uppula Raju

|

Updated on: Apr 28, 2021 | 4:11 PM

IPL 2021: ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు నుంచి తొలగించాడు. తరువాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జట్టు నుంచి తొలగించాడు. ఈ ఆటగాడి పేరు జగదీషా సుచిత్ ఈ 27 ఏళ్ల స్పిన్నర్ ఈ ఐపీఎల్ సీజన్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపిఎల్ 2021 వేలంలో జగదీషా సుచిత్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అయితే ఈ రోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో జగదీషా సుచిత్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ఈ సీజన్లో జగదీషా సుచిత్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు కానీ ఇందులో అతను బంతితో పాటు బ్యాట్ తో కూడా తన ప్రతిభను చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుచిత్ 6 బంతుల్లో అజేయంగా 14 పరుగులు చేయడమే కాకుండా 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. సుచిత్ బౌలింగ్ వల్ల ఏర్పడిన ఒత్తిడి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌పై స్పష్టంగా కనిపించింది.

జగదీషా సుచిత్ 2015 లో ముంబై ఇండియన్స్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. రెండేళ్లుగా సుచిత్.. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో భాగం. తరువాత 2019లో ఢిల్లీ జట్టులో చేరాడు. 2021 వేలంలో ఈ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఆటతీరు విషయానికొస్తే సుచిత్ 16 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకనామీ 8.51 గా ఉంది. అతని ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 14 పరుగులకు రెండు వికెట్లు.

రైతులకు గుడ్ న్యూస్..! సబ్సిడీపై 10 హెచ్‌పి సోలార్ పంపు మోటార్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?

Kidney disease: ఊర్లకు ఊర్లనే మింగేస్తున్న మహమ్మారి.. ఏ ఇంటిని కదిలించిన రక్తకన్నీరే.. 13 మండలాలను వణికిస్తున్న భూతం..!

Covid-19: కరోనా నిమిషంలోనే వ్యాపిస్తుంది.. రిపోర్టు నెగిటివ్ వచ్చినా.. ఏమాత్రం అశ్రద్ధ వద్దు: గులేరియా