Ishan Kishan: ప్రమాదంలో యంగ్ క్రికెటర్‌ కెరీర్‌.. టీ20 ప్రపంచకప్‌కు ఇషాన్‌ కిషన్‌ దూరం?

గతేడాది వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి, టీ-20 సిరీస్‌లో వరుసగా అర్ధసెంచరీలు సాధించినా.. టీమ్ ఇండియాలో ఇషాన్ కిషన్ స్థానం కన్ఫర్మ్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఎప్పుడు ఇషాన్ కిషన్‌కే ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు కిషన్‌ క్రికెట్‌ కెరీర్‌ లో గందరగోళానికి కారణమేంటన్నది జవాబు లేని ప్రశ్నలా మారింది.

Ishan Kishan: ప్రమాదంలో యంగ్ క్రికెటర్‌ కెరీర్‌.. టీ20 ప్రపంచకప్‌కు ఇషాన్‌ కిషన్‌ దూరం?
Ishan Kishan

Updated on: Jan 10, 2024 | 10:53 AM

భారత జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతోంది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గతేడాది వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి, టీ-20 సిరీస్‌లో వరుసగా అర్ధసెంచరీలు సాధించినా.. టీమ్ ఇండియాలో ఇషాన్ కిషన్ స్థానం కన్ఫర్మ్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఎప్పుడు ఇషాన్ కిషన్‌కే ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు కిషన్‌ క్రికెట్‌ కెరీర్‌ లో గందరగోళానికి కారణమేంటన్నది జవాబు లేని ప్రశ్నలా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌పై టీమ్ ఇండియాను ప్రకటించిన ఒక రోజు తర్వాత, క్రిక్‌బజ్ ఒక నివేదికను ప్రచురించింది, ఇందులో T20 జట్టు నుండి ఇషాన్ కిషన్‌ను మినహాయించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు ఇషాన్ కిషన్ వైట్ బాల్ ఫార్మాట్‌లో టీమిండియాకు వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ అవుతాడని అనిపించినప్పటికీ, అతను హఠాత్తుగా జట్టు నుంచి తప్పుకోవడం అందరినీ కలిచివేస్తోంది. టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు, ఇషాన్ కిషన్ తాను మానసికంగా అలసిపోయానని, చాలా కాలంగా జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నానని, అందుకే తనకు విరామం కావాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాకు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు క్రమశిక్షణా రాహిత్యంతో బీసీసీఐ కూడా ఇషాన్‌పై ఆగ్రహంగా ఉందంటూ ఈ రిపోర్ట్ వచ్చింది. విరామం తీసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. అదే సమయంలో అతను ఎప్పుడు టీమ్ ఇండియాలో చేరగలడనే విషయాన్ని ఇంకా బీసీసీఐకి చెప్పలేదు. BCCI కూడా ఇషాన్‌ను సంప్రదించింది, కానీ అతను అందుబాటులోకి రావడం లేదు. ఇషాన్‌ను ఎంపిక చేయలేకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. మరోవైపు ఇషాన్ చాలా కాలంగా జట్టుతో ఉన్నాడని, కానీ అతనికి అవకాశాలు రావడం లేదని, అందుకే అతను అసంతృప్తిగా ఉన్నాడని కూడా, అందుకే జట్టు నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన ఇషాన్‌కు టీమ్‌ఇండియాలో అవకాశం దక్కింది. అయితే సీనియర్ ఆటగాళ్లు రావడంతో పాటు కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్‌గా మారడంతో ఇషాన్ కిషన్‌కు తలుపులు మూసుకుపోయాయి. తొలుత కేఎల్ రాహుల్ టెస్టు జట్టు, వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా అవతరించడంతో ఇషాన్ కిషన్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనితో పాటు T-20లో ఇషాన్ కిషన్ కు అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకంటే అతను అంతకుముందు అతను ఓపెనింగ్ చేశాడు. అయితే ఇప్పుడు గిల్, జైస్వాల్‌ రావడంతో ఇషాన్ వికెట్ మిడిల్ ఆర్డర్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ టీమ్ ఇండియా ప్రణాళికల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. బహుశా అతను T20 ప్రపంచ కప్ లోనూ ఆడకపోచ్చని తెలస్తోంది. దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి తప్పుకోవడమే కాకుండా ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌లో కూడా కనిపించకపోవడానికి ఇదే కారణం. ఇషాన్ కిషన్ 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..