IRE Vs NZ: కివీస్‌ ఆటగాళ్లను కంగారు పెట్టించిన టవల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా.. అసలేం జరిగిందంటే..

|

Jul 16, 2022 | 6:17 PM

IRELAND VS NEW ZEALAND: న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ వన్డే సిరీస్‌ను బ్యాక్‌ క్యాప్స్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసినా ఐర్లాండ్‌ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగిన..

IRE Vs NZ: కివీస్‌ ఆటగాళ్లను కంగారు పెట్టించిన టవల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా.. అసలేం జరిగిందంటే..
Ireland Vs New Zealand
Follow us on

IRELAND VS NEW ZEALAND: న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ వన్డే సిరీస్‌ను బ్యాక్‌ క్యాప్స్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసినా ఐర్లాండ్‌ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 3 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఈ గెలుపు సంగతి పక్కన పెడితే ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ (Blair Tickner) ఓ గుడ్‌ లెంగ్త్‌ బంతిని ఆఫ్‌స్టంప్‌కు దూరంగా విసిరాడు. క్రీజులో ఉన్న ఐర్లాండ్‌ బ్యాటర్‌ సిమీ సింగ్‌ (Simi Singh) థర్డ్‌మ్యాన్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌ టాప్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రెనాల్డ్స్‌ కూడా మొదట ఔట్‌ అంటూ వేలు పైకెత్తాడు. అయితే వెంటనే ఔట్‌ కాదంటూ ఔటైన బాల్‌ను డెడ్‌బాల్‌గా పరిగణించాడు. దీంతో అప్పటిదాకా ఆనందంలో మునిగిపోయిన ఆటగాళ్లు షాక్‌ తిన్నారు.

ఏకాగ్రత దెబ్బతింటుంటూ..

ఇవి కూడా చదవండి

ఇది జరిగిన వెంటనే కెప్టెన్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ వద్దకు వచ్చాడు. ఎందుకు ఔట్‌ కాదంటూ అడిగాడు. కాగా టిక్నర్‌ బంతిని వేయడానికి ముందే అతని టవల్‌ పిచ్‌పై పడింది. ఇది క్రికెట్‌ నిబంధనలకు విరుద్దమని.. ఇలాంటి చర్యల వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌బాల్‌గా ప్రకటించినట్లు అంపైర్‌ తెలిపాడు. టవల్‌ వల్ల బ్యాటర్‌ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని లాథమ్‌ వివరించినప్పటికి అంపైర్‌ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. దీంతో చేసేదేం లేక టామ్‌ లాథమ్‌ నిరాశగా వెనుదిరిగాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

కాగా మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) నిబంధనల ప్రకారం లా 20.4.2.6 కింద ఏవైనా శబ్దాలు.. ఏదైనా కదలిక.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఫీల్డ్‌ అంపైర్‌కు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించే అధికారం ఉంటుంది. అదేవిధంగా లా 20.4.2.7 ప్రకారం స్ట్రైకింగ్‌లో ఉ‍న్న బ్యాటర్‌ దృష్టి మరల్చడానికి లా 41.4 లేదా లా 41.5 (ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను అడ్డుకోవడం) కిందకు వస్తుంది. టిక్నర్‌ తన తప్పు లేకున్నప్పటికి అతని టవల్‌ బంతి విడవడానికి ముందే పిచ్‌పై పడడంతో అంపైర్‌ నిబంధనల ప్రకారం డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..