- Telugu News Sports News Cricket news IPL team SRH Player Heinrich Klaasen earn more than 27 crore with 6 month rest from Cricket
6 నెలలు రెస్ట్ మోడ్.. రూ. 27 కోట్ల జీతం.. లైఫ్ అంటే కావ్యా పాప ప్లేయర్‌దే భయ్యా..
Cricketer Life: అందరూ డబ్బు సంపాదిస్తారు. కానీ, డబ్బు సంపాదించడంలో సరైన విశ్రాంతితోపాటు, ఆనందం పొందుతూ డబ్బు సంపాదించడంలో అసలైన మజా ఉంటుంది. హెన్రిక్ క్లాసన్ సంపాదన విధానం ఇప్పుడు ఇలాగే మారింది. అతను 6 నెలలలు మాత్రమే పనిచేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.
Updated on: Aug 26, 2025 | 1:29 PM

సంవత్సరంలో 12 నెలలు, ఆటగాళ్ళు 6 నెలలు విశ్రాంతి తీసుకుంటారు. చాలా రోజుల విశ్రాంతి తర్వాత కూడా ఓ ప్లేయర్ 27 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడని మీకు తెలుసా. ఇలాంటి జీవితాన్ని గడిపే క్రికెటర్ ఎవరో మీకు తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ ప్లేయర్ ఎవరో మన కూకట్ పల్లి క్లాసెన్.. అదేనండీ ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడుతోన్న సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ అన్నమాట.

అతను ఈ సంవత్సరం జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. క్లాసెన్ 6 నెలల విశ్రాంతి, 6 నెలల పనితో ఎంజాబ్ చేస్తున్నాడు. అతను క్రికెట్ మైదానంలో గడిపే 6 నెలలు, వివిధ టీ20 లీగ్‌లలో ఆడుతూ తన బ్యాట్‌కు పని చెబుతున్నాడు. వీటి నుంచి 27 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హెన్రిక్ క్లాసెన్ ఏ 6 నెలలు విశ్రాంతి తీసుకుంటాడు, అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? హెన్రిక్ క్లాసెన్ పని మొదలయ్యే నెల జనవరి. ఈ నెలలో అతను SA20 లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత, అతను మార్చి, మే మధ్య రెండు నెలలు IPLలో బిజీగా ఉన్నాడు. జూన్‌లో అతను మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో, అతను జులై-ఆగస్టు మధ్య 1 నెల పాటు ది హండ్రెడ్‌లో ఆడుతున్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ వివిధ క్రికెట్ లీగ్‌లలో ఆడే నెలల్లో, అక్కడ ఆడినందుకు అతనికి జీతం కూడా వస్తుంది. అతను ఆడే టీ20 లీగ్‌ల జీతం కలిపితే, అన్ని లీగ్‌లలో అతని మొత్తం జీతం రూ.27.30 కోట్ల కంటే కొంచెం ఎక్కువ.

జనవరిలో, SA20లో ఆడినందుకు క్లాసెన్ రూ. 45 లక్షల వరకు అందుకున్నాడు. అయితే, SA20, 2026 వేలంలో ఈ మొత్తం పెరుగుతుందని భావిస్తున్నారు. క్లాసెన్ IPL నుంచి అత్యధిక జీతం పొందుతాడు. IPLలో ఆడినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అతను రూ. 23 కోట్లు పొందుతున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో హెన్రిక్ క్లాసెన్ జీతం రూ. 1.53 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. అదే సమయంలో, ది హండ్రెడ్‌లో ఆడినందుకు అతను రూ. 2.32 కోట్ల కంటే కొంచెం ఎక్కువ పొందుతాడు.

ఇక హెన్రిచ్ క్లాసెన్ విశ్రాంతి గురించి మాట్లాడితే సంవత్సరంలో 6 నెలలు ఫుల్ టైం ఫ్యామిలీకి కేటాయిస్తాడు. క్లాసెన్ క్రికెట్‌ను మరచిపోయి, తన కుటుంబంతో తిరుగుతూ, సరదాగా గడుపుతాడు.




