Duleep Trophy: 5 వరుస సిక్సులతో ఓవర్‌నైట్‌లో స్టార్.. కట్‌చేస్తే.. దేశవాళీలో వరుస ప్లాఫ్ షోలతో జీరో.. విండీస్‌ సిరీస్ నుంచి ఔట్?

Rinku Singh, IND vs WI T20I: ఐపీఎల్‌లో ఓవర్‌నైట్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన టీమిండియా యువ క్రికెటర్ రింగు సింగ్.. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు.

Duleep Trophy: 5 వరుస సిక్సులతో ఓవర్‌నైట్‌లో స్టార్.. కట్‌చేస్తే.. దేశవాళీలో వరుస ప్లాఫ్ షోలతో జీరో.. విండీస్‌ సిరీస్ నుంచి ఔట్?
Duleep Trophy 2023 Rinku Si

Updated on: Jul 01, 2023 | 10:49 AM

Duleep Trophy 2023: ఐపీఎల్‌లో ఓవర్‌నైట్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన టీమిండియా యువ క్రికెటర్ రింగు సింగ్.. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరపున ఆడుతున్న రింకూ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో రింకూ సింగ్ కేకేఆర్ తరపున గేమ్ ఫినిషర్ పాత్రను పోషించాడు. 14 మ్యాచ్‌లలో 59.25 సగటు, 149.53 స్ట్రైక్ రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు టీమిండియాకు టీ20 జట్టులో ఎంపికయ్యే ఛాన్స్ పట్టేశాడు. అయితే భారత జట్టుకు ఎంపిక కాకముందు దేశవాళీ టోర్నీలో రింకూ ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది.

కర్ణాటకలోని ఆలూరులో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టు ఈస్ట్ జోన్ జట్టుతో తలపడుతోంది. సెంట్రల్ టీమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ సింగ్‌పై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో రింకూ విఫలమచకచాడే.

తన తొలి ఇన్నింగ్స్‌లో 58 బంతులు ఎదుర్కొని 6 బౌండరీల సాయంతో 38 పరుగులు చేసిన రింకూ సింగ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోరును దాటలేదు. రెండో ఇన్నింగ్స్‌ను బౌండరీతో ప్రారంభించిన రింకు 8 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా, ఐపీఎల్ 2023లో ఫ్లాప్ షో నుంచి విమర్శలను ఎదుర్కొన్న రియాన్ పరాగ్ బౌలింగ్‌లో రింకు వికెట్‌ను కోల్పోయాడు. అయితే ఈ పేలవ ఇన్నింగ్స్‌ ఉన్నప్పటికీ వెస్టిండీస్ టూర్‌కు రింకూ ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఈ పర్యటనలో రింకూ సింగ్‌కు టీ20 సిరీస్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. టెస్టు, వన్డే సిరీస్‌లకు ఇప్పటికే జట్టును ప్రకటించగా, కొద్ది రోజుల తర్వాత టీ20 జట్టును ఎంపిక చేయనున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విజయం దిశగా దూసుకుపోతోంది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఈస్ట్ జోన్ 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంట్రల్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేసి, ఈస్ట్ జోన్‌కు 300 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనికి సమాధానంగా ఈస్ట్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.