IPL Auction2025 : మెగా వేలంలో RCB కి లక్కి ఛాన్స్.. ఆ కీలక ప్లేయర్లు రూ.10 కోట్లకే దక్కే అవకాశం

|

Nov 18, 2024 | 9:15 AM

సౌదీలో నవంబర్ 24, 25న జరగనున్న IPL మెగా వేలంలో 1500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. RCB గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్‌ను విడుదల చేసింది, వీరు వేలంలో భారీ ధర పలికే అవకాశముంది. ఆర్సీబీ జట్టు పునర్నిర్మాణం కోసం నిర్ణయాలు తీసుకుంటుండగా, ఈ ముగ్గురిపై ఇతర జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి.

IPL Auction2025 : మెగా వేలంలో RCB కి లక్కి ఛాన్స్.. ఆ కీలక ప్లేయర్లు రూ.10 కోట్లకే దక్కే అవకాశం
Will Jacks
Follow us on

సౌదీలో జరగనున్న IPL మెగా వేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో 1500 మందికి పైగా ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఈసారి తన జట్టును కొత్తగా పునర్నిర్మించుకునేందుకు ముగ్గురు కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. వీరిని ఆక్షన్ లో బిడ్ యార్డ్‌లో భారీ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 

RCB విడుదల చేసిన ముగ్గురు ఆటగాళ్లు:

  1. గ్లెన్ మాక్స్‌వెల్:

ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు పొందిన ఈ ఆల్‌రౌండర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు. అతనిది ఒక ఆత్మవిశ్వాసం గల ఆటతీరు. ఫీల్డింగ్ లో కూడా మ్యాక్స్ అదరగొడతాడు. RCB విడుదల చేసినప్పటికీ, అతనిపై బిడ్ వేయడానికి బహుశా జట్ల యజమానులు ఆసక్తిగా ఉన్నాయి.

  1. విల్ జాక్స్:

ఇంగ్లండ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. RCB అతనితో నూతనమైన ఒప్పందాన్ని చేపట్టింది, అతను 8 మ్యాచ్‌లలో 230 పరుగులు చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. విల్ జాక్స్ కి ఇప్పుడు 25 ఏళ్లు దీంతో భవిష్యత్తు దృష్ట్యా అతడిని తీసుకోవాలని యోచిస్తోన్నాయి. దీంతో అతడు బిడ్డింగ్ లో భారీగా ధర పలకవచ్చు.

  1. మహ్మద్ సిరాజ్:

హైదరాబాద్ కి చెందని బౌలర్ సిరాజ్, తన నిలకడైన ఆటతీరు తో, ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 93 మ్యాచ్‌లలో 93 వికెట్లు తీసిన ఈ బౌలర్, కొత్త బంతితో అదేవిధంగా డెత్ ఓవర్ల బౌలింగ్ లో ప్రత్యేకత చూపించాడు. సిరాజ్ తన లైన్ అండ్ లెంగ్త్ తో వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించగలడు.

ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ ప్రతిభతో IPL 2025 మెగా వేలంలో మరోసారి సత్తా చాటే అవకాశముంది. సౌదీ అరేబియాలో జరిగే ఈ వేలంలో, ఎక్కువ మంది జట్ల యజమానులు ఈ ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవాలనుకుంటారు. RCB ఈ ముగ్గురిని విడుదల చేసినప్పటికీ, వారు ఆ జట్టు భవిష్యత్ కోసం మిగతా ప్లేయర్లపై దృష్టి పెట్టి కొత్త జట్టు నిర్మాణం చేపట్టింది. RCB నుండి విడిపోయిన ఈ ముగ్గురు ఆటగాళ్లలో విల్ జాక్స్ ని మళ్లీ ఆర్సీబీ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అతడి కోసం 4 నుంచి 6 కోట్ల వరకు వెచ్చించే అవకాశముంది. ఇక మ్యాక్స్ వెల్ సిరాజ్ కూడా చెరో రెండు కోట్లకు దక్కించుకొవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.