DC vs GT IPL 2026 Result: చివరి బంతికి హైడ్రామా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం

Delhi Capitals vs Gujarat Titans Result, IPL 2026: జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు, జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు సాధించారు. ఢిల్లీ తరఫున..

DC vs GT IPL 2026 Result: చివరి బంతికి హైడ్రామా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం
Dc Vs Gt Ipl 2026 Result

Edited By:

Updated on: Apr 08, 2026 | 11:42 PM

Delhi Capitals vs Gujarat Titans Result, IPL 2026: ఐపీఎల్ 19లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఒక పరుగు తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో వారికి తొలి ఓటమిని అందించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 92 పరుగులు చేసినా, జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు.

జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు, జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు సాధించారు. ఢిల్లీ తరఫున ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Follow Us