Video: అది క్యాచ్ కాదు.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్.. SRH vs RCB మ్యాచ్‌తో లొల్లి షురూ..

Phil Salt catch Controversy: ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే అంపైరింగ్ నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. చిన్నాస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో ఫిల్ సాల్ట్ పట్టిన ఒక క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధానికి దారితీసింది. బౌండరీ లైన్ వద్ద అతను బంతిని అందుకున్న తీరుపై సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Video: అది క్యాచ్ కాదు.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్.. SRH vs RCB మ్యాచ్‌తో లొల్లి షురూ..
Ipl 2026 Srh Vs Rcb Phil Salt Catch Controversy

Updated on: Mar 29, 2026 | 7:46 AM

Phil Salt catch Controversy: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోమారియో షెపర్డ్ వేసిన బంతిని హెన్రిచ్ క్లాసెన్ లెగ్ సైడ్ గాల్లోకి లేపాడు. డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. అయితే, క్యాచ్ పూర్తి చేసే క్రమంలో అతను బౌండరీ లైన్ పక్కన పల్టీలు కొట్టాడు. ఆ సమయంలో సాల్ట్ కాలు లేదా శరీరం బౌండరీ తాడుకు తగిలిందని సన్‌రైజర్స్ శిబిరం భావించింది. మైదానంలోని అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్‌కు పంపగా, అతను చాలా సేపు పరిశీలించి ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. ఇది ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది.

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్‌ప్లేలో ముగ్గురు కీలక ఆటగాళ్లను కోల్పోయినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతనికి క్లాసెన్ (31) మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

బౌలింగ్‌లో జాకబ్ డఫీ మాయాజాలం..

ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన జాకబ్ డఫీ తొలి మ్యాచ్‌లోనే ముద్ర వేశాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరియు నితీష్ కుమార్ రెడ్డిలను తన తెలివైన బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు. రోమారియో షెపర్డ్ కూడా 3 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

చివరిలో అనికేత్ వర్మ మెరుపులు..


వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో అనికేత్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు క్యాచ్‌లు పట్టడం విశేషం. అందులో ఇషాన్ కిషన్ క్యాచ్ ఒక చేత్తో డైవ్ చేస్తూ పట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us