
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం లేదా వదిలేయడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో గత సీజన్లలో ఫెయిలైన కొంతమంది సీనియర్ ఆటగాళ్లను జట్లు విడుదల చేస్తే, వారికి వేలంలో కొత్త కొనుగోలుదారులు దొరకడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు చాలా జట్లు ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్ల వైపు చూస్తున్నాయి. ఒకవేళ ఈ ఐదుగురు భారత ఆటగాళ్లు విడుదలయితే వారికి మళ్లీ అవకాశం దొరకడం కష్టమే.
ఐపీఎల్‌లో గతంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కొందరు సీనియర్ ఆటగాళ్లు, ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వారి ఫ్రాంచైజీలు వారిని రిలీజ్ చేస్తే, ఐపీఎల్ 2026 వేలంలో వారికి స్థానం దొరకడం కష్టమే. ఈ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే.
1. అజింక్య రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసి, అతనికి కెప్టెన్సీ కూడా అప్పగించింది. అయితే 37 ఏళ్ల రహానే బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా, కెప్టెన్‌గా జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. కేకేఆర్ పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
2. విజయ్ శంకర్
చెన్నై సూపర్ కింగ్స్ విజయ్ శంకర్‌ను రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. విజయ్ ఆరు మ్యాచ్‌లలో కేవలం 118 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.
3. మోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన 37 ఏళ్ల మోహిత్ శర్మ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అతని బౌలింగ్ సగటు దాదాపు 129, ఎకానమీ రేట్ 11గా ఉంది.
4. ఇషాంత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ జట్టులో భాగమైన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా 37 ఏళ్ల వయసులో పేలవమైన ప్రదర్శన చూపించాడు. ఏడు మ్యాచ్‌లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అతని బౌలింగ్ సగటు దాదాపు 52, ఎకానమీ రేట్ 11గా ఉంది.
5. దీపక్ హుడా
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన దీపక్ హుడా ప్రదర్శన కూడా తీవ్ర నిరాశ కలిగించింది. ఏడు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వచ్చినా, కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 6.20, స్ట్రైక్ రేట్ 75.61గా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..