Vaibhav Suryavanshi : హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీలకే చెమటలు పట్టిస్తున్న బుడ్డోడు.. కొత్త రికార్డుకు మరో అడుగు దూరం

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం, రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊచకోతను ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మీద ఉన్నాయి.

Vaibhav Suryavanshi : హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీలకే చెమటలు పట్టిస్తున్న బుడ్డోడు.. కొత్త రికార్డుకు మరో అడుగు దూరం
Vaibhav Suryavanshi

Updated on: Mar 30, 2026 | 1:23 PM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం, రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊచకోతను ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మీద ఉన్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఒక మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటంటే.. ఐపీఎల్ కెరీర్‌లో 300 పరుగుల మార్కును చేరుకోవడం

చెన్నైపై వైభవ్ రికార్డు మామూలుగా లేదు

వైభవ్ సూర్యవంశీకి చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఏదో ప్రత్యేకమైన గురి ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 57 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 172.72 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఆ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థి ఎదురుకావడంతో వైభవ్ మరోసారి గర్జించేందుకు రెడీ అయిపోయాడు.

మరో 48 పరుగులు చేస్తే చాలు.. చరిత్రే

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 252 పరుగులు ఉన్నాయి. ఇందులో మొత్తం 24 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. గువహటి వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో వైభవ్ మరో 48 పరుగులు చేస్తే, ఐపీఎల్ కెరీర్‌లో 300 పరుగుల క్లబ్‌లో చేరిపోతాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే “నేను ఈసారి ఏదో ఒక కొత్త రికార్డు సృష్టిస్తాను” అని వైభవ్ చెప్పిన మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 300 పరుగుల మైలురాయిని దాటడం అతడికి పెద్ద కష్టమేమీ కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us