RCB Vs SRH: ఏం తాగి వచ్చావ్ అన్నా.! అవేం పిల్లబచ్చా ఆటలు.. చేజేతులా అస్సాం పంపించేశావ్

ప్లేఆఫ్స్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడగొట్టుకుంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మొదట్లో పరుగుల వరద పారించగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి.. మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఇందులో ఓ ప్లేయర్ ఆడిన ఆటతీరుకు సర్వత్రా విమర్శలు వచ్చాయి.

RCB Vs SRH: ఏం తాగి వచ్చావ్ అన్నా.! అవేం పిల్లబచ్చా ఆటలు.. చేజేతులా అస్సాం పంపించేశావ్
Rcb Vs Srh

Updated on: May 24, 2025 | 12:38 PM

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒకదశలో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచేటట్టు కనిపించినా.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ బ్యాటింగ్ చూస్తే.. ఇవేం పిల్లబచ్చా ఆటలు అనేలా అనిపిస్తుంది.

232 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో ఆర్సీబీ ధీటుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి పరుగుల వరద పారించారు. ఇద్దరు కలిసి 6 ఓవర్లలోనే 72 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో.. 174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కృనాల్ పాండ్యా(8) బ్యాటింగ్‌కు వచ్చాడు. అనుభవం ఉన్న ప్లేయర్ కాబట్టి.. కచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన 14వ ప్లేయర్‌గా కృనాల్ పాండ్యా చరిత్రకెక్కాడు.

ప్యాట్ కమ్మిన్స్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో స్టంప్స్‌కు బ్యాట్ తగిలి.. కృనాల్ పాండ్యా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. బరిలోకి దిగిన దగ్గర నుంచి.. ఎప్పుడెప్పుడు పెవిలియన్‌కు వెళ్లాలా..? అనే హర్రీబర్రీలో ఉన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్సీబీ టాప్-2లోకి వెళ్లాలంటే.. నెక్స్ట్ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. అలాగే మిగతా జట్ల సమీకరణాలపై కూడా ఆధారపడాల్సి ఉంది.