
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొని.. క్వాలిఫైయర్ 1 ఆడేందుకు రెడీ అయిపోయింది. వారితో క్వాలిఫైయర్ 1లో పోటీ పడే టీమ్ గుజరాత్ టైటాన్సా? లేక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా? అనేది.. మంగళవారం జరిగే ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో తేలిపోనుంది. ఆర్సీబీ గెలిస్తే.. క్వాలిఫైయర్ 1లో పంజాబ్‌తో తలపనుంది. ఒక వేళ లక్నో గెలిస్తే.. ఆర్సీబీ ఎలిమినేటర్‌లో ముంబైతో ఆడనుంది. కాగా.. పంజాబ్ కింగ్స్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. అది కూడా టాప్ 2లో లీగ్ మ్యాచ్‌లు ఫినిష్ చేసి.. క్వాలిఫైయర్ 1 ఆడనుంది.
పంజాబ్ కింగ్స్ ఇలాంటి ప్రదర్శన కనబరుస్తుందని టోర్నీ ఆరంభంలో ఎవరు ఊహించి ఉండరు. కానీ, ఓ ప్లేయర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌లు పూర్తి అయ్యేసరికి టేబుల్ టాపర్‌గా ఉంటుందని. అతను చెప్పినట్లు.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. క్వాలిఫైయర్ 1లో తలపడేందుకు రెడీ అయిపోయింది. మరి పంజాబ్ కింగ్స్ కచ్చితంగా టాప్ 2లోనే ఉంటుందని చెప్పిన ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఆ జట్టు పొరపాటును వేలంలో కొనుగోలు చేసిన శశాంక్ సింగ్. గత ఐపీఎల్ సీజన్‌లో శశాంక్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. దీంతో అతన్ని ఐపీఎల్ 2025 కోసం కూడా పంజాబ్ కింగ్స్ రిటెన్ చేసుకుంది. ఈ ఏడాది కూడా అతని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అలాగే ఆ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా రావడం కూడా పంజాబ్‌కు బాగా కలిసి వచ్చింది. అయితే.. మార్చ్ 17న ప్రముఖ యూట్యూబర్ శుభంకర్ మిశ్రాతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. శశాంక్ చాలా నమ్మకంగా పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాత నంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పాడు. అతను అలా చెప్పడంతో శుభంకర్ మిశ్రా నవ్వాడు. ఇది జరగకపోతే.. తర్వాత నిన్ను ట్రోల్ చేస్తారంటూ శశాంక్‌ను వారించినా కూడా లేదు లేదు ఈ సారి టీమ్ అద్భుతంగా సెట్ అయింది. మేం కచ్చితంగా టాప్ 2లో ఉంటామంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు అతను చెప్పినట్లే జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
17th March – Shashank Singh said Punjab Kings will finish in the Top 2.
26th May – Punjab Kings finishes in the Top 2 and plays Qualifier 1. 🥶 pic.twitter.com/mP7BRj3Ik0
— Shubhankar Mishra (@shubhankrmishra) May 26, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..