
ఐపీఎల్ 2025 సీజన్ వేడి రేగుతున్న తరుణంలో, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (MI), పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ రోజు వాంఖడే స్టేడియంలో 33వ మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది రెండు జట్లకూ ఎంతో కీలకమైన పోరుగా మారింది. ఎందుకంటే, ఇరు జట్లు కూడా ఈ సీజన్ తొలి ఆరు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయం మాత్రమే సాధించగా, పాయింట్ల పట్టికలో ముంబై ఏడవ స్థానంలో, హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి.
ముంబై ఇండియన్స్ గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సత్తాచాటింది. ముఖ్యంగా 19వ ఓవర్లో మూడు రనౌట్లు చేసి 12 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు, ఫీల్డర్లు చాకచక్యంగా రాణించారు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిగా అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 141 పరుగులు (55 బంతుల్లో) చేసి సంచలనం సృష్టించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో SRH 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో ఛేదించి అరుదైన విజయాన్ని నమోదు చేసింది.
ఈ రోజు జరిగే మ్యాచ్‌ను ముంబై అభిమానులు, హైదరాబాద్ అభిమానులు పెద్ద ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. స్టాండింగ్స్ పరంగా చూస్తే, ముంబైకి +0.104 నెట్ రన్ రేట్ ఉన్నప్పటికీ, SRH నాలుగు పరాజయాలతో -1.245 నెట్ రన్ రేట్‌తో అట్టడుగు స్థానానికి చేరింది. ఇది ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత రెండవ చెత్త రికార్డు కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తమ గెలుపు పరంపరను కొనసాగించేందుకు పూర్తి శక్తితో పోటీ పడనున్నాయి. ఒకవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తుండగా, మరోవైపు పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని SRH ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నెగ్గే జట్టుకు పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఈ పోరు అభిమానులకు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (w), ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (సి), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..