కేఎల్ రాహుల్‌కు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా షాక్ ఇవ్వనున్నాడా? జట్టు కెప్టెన్సీ నుంచి అతనిని తప్పించనున్నారా? కేవలం ప్లేయర్ గానే టీమ్ లో కొనసాగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బుధవారం (ఆగస్టు 28) ఎల్‌ఎస్‌జీ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు సంజీవ్ గోయెంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాహుల్ తమ కుటుంబంలో అంతర్భాగమని సంజీవ్ సమాధానం ఇచ్చారు కానీ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేస్తానని ఎక్కడా చెప్పలేదు. అలాగే కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కెప్టెన్‌ని నిర్ణయించడానికి, రిటైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని బదులిచ్చారు. అయితే వచ్చే సీజన్‌లో కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతానని కేఎల్ రాహుల్ కూడా స్వయంగా చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత మూడు నెలలుగా లక్నో సూపర్‌జెయింట్స్ సోషల్ మీడియా ఖాతా KL రాహుల్ గురించి ఒక్క పోస్ట్‌ను కూడా షేర్ చేయలేదు. అదే సమయంలో, LSG కోసం ఆడిన చాలా మంది ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు ఇందులో షేర్ చేశారు. ఇటీవల శ్రీలంకతో జరిగే సిరీస్ తో కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కనీసం దాని గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అలాగే కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలో ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశారు. ఆ ఫోటోను కూడా లక్నో సూపర్‌జెయింట్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్‌ను తొలగించడం దాదాపు ఖాయం. అలాగే రాబోయే సీజన్‌లో రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో కనిపించడం కూడా అనుమానమే.
ఇదిలా ఉంటే రాబోయే ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఏ జట్టు తరఫున ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత సీజన్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఓడిపోయినందుకు సంజయ్ గోయెంకా కెప్టెన్ KL రాహుల్‌ను మైదానంలోనే దుర్భాషలాడాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ ఎల్‌ఎస్‌జీ టీమ్ నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి.
🚨 IPL Update 🚨 KL Rahul met Sanjeev Goenka in Kolkata. The LSG franchise is reportedly keen on retaining KL Rahul. In other words, RCB’s dream is not coming true Source – [Vijay Thakur from Cricbuzz] #earthquake #Paris2024 #Telegram #DonBelle pic.twitter.com/iO0eknHPto
— Roni Das (@RoniDas1297) August 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..