మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తనను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంనందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంచలన శ్రీలంక పేసర్, డెత్ బౌలింగ్‌లో తన నైపుణ్యాలతో ఇప్పటికే ఐపీఎల్‌లో సత్తా చాటాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో MS ధోనీతో మళ్లీ కలిసి ఆడే అవకాశం పట్ల పతిరనా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు తెలియజేసాడు.
2022లో CSKకి అరంగేట్రం చేసిన పతిరన, అప్పటి నుండి జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2023లో 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు. 2024లో ఆరు మ్యాచ్ లలోనే 13 వికెట్లు తీసి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా తన పేరు తెచ్చుకున్నాడు. మొత్తం 20 ఐపీఎల్ మ్యాచ్‌లలో, 34 వికెట్లు, 7.88 ఎకానమీ రేట్‌తో 4/28 అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. మహేంద్ర సింగ్ ధోనీతో పని చేయడం ప్రతి యువ క్రికెటర్ కల. పతిరనా మాట్లాడుతూ, “ధోనీ జట్టులో లెజెండరీ లీడర్‌గా ఉండటం గొప్ప అనుభవం” అని మళ్లీ ఆ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం పట్ల ఆసక్తిగా ఉన్నట్టు చెప్పాడు.
CSK ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతీషా పతిరనా వంటి ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసింది. ఈ వ్యూహం, అనుభవజ్ఞులైన ఆటగాళ్లుకు కొత్త ప్రతిభల మధ్య సమతుల్యతను నిలుపుకోవడంలో వారి దృక్పథాన్ని చూపుతుంది. పతిరనా అద్భుత ప్రదర్శనలతో, CSKలో అతని పాత్ర మరింత ప్రధానంగా మారే అవకాశం ఉంది. మళ్లీ ధోనీతో కలిసి ఆడే అవకాశాన్ని పతిరనా పూర్తి ఉపయోగించుకుంటాడని భావించవచ్చు. CSK అభిమానులు, జట్టు ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ విజయ పరంపరను కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు.
574 ఆటగాళ్లు వేలానికి దాఖలయ్యారు, వీరిలో 366 మంది భారతీయులు, 208 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మార్కీ ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి భారతీయులు మరియు మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. జట్లు రైట్-టు-మ్యాచ్ (RTM) కార్డులను ఉపయోగించి ఆటగాళ్లను తిరిగి పొందే అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి.