IPL 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఆటగాళ్ల వేలం ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. . సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం (నవంబర్ 05) అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగాల్సిన ఈ మెగా వేలం ప్రక్రియను ఆఖరి నిమిషంలో జెడ్డాకు మార్చారు.
ఏయే దేశం నుంచి ఎంత మంది రిజిస్టర్ చేసుకున్నారంటే?
- భారత్: ఈ మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు కాగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
- దక్షిణాఫ్రికా: ఈ మెగా వేలానికి దక్షిణాఫ్రికా ప్లేయర్లు అత్యధికంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం మొత్తం 91 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
- ఆస్ట్రేలియా: ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. ఈ మెగా వేలం కోసం ఆస్ట్రేలియా నుంచి 76 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
- ఇంగ్లండ్: ఇంగ్లండ్‌కు చెందిన 52 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
- న్యూజిలాండ్: ఐపీఎల్ మెగా వేలంలో 39 మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కివీస్ దళానికి చెందిన స్టార్ ఆటగాళ్లు ఈసారి మెగా వేలంలో కనిపించనున్నారు.
- వెస్టిండీస్: ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేసిన కరీబియన్ క్రికెటర్లు ఈసారి మాత్రం ధనాధన్ లీగ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఈసారి వెస్టిండీస్‌కు చెందిన 33 మంది ఆటగాళ్లు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
- ఆఫ్ఘనిస్తాన్: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 29 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి అవకాశం దక్కుతుందో చూడాలి.
- శ్రీలంక: ఈసారి శ్రీలంక ఆటగాళ్లు పెద్దఎత్తున తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం ఐపీఎల్ మెగా వేలం జాబితాలో 29 మంది శ్రీలంక ఆటగాళ్ల పేర్లు వచ్చాయి.
- బంగ్లాదేశ్: ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు కనిపించడం చాలా అరుదు. అయితే ఈసారి 13 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
- నెదర్లాండ్స్ : ఈ మెగా వేలానికి నెదర్లాండ్స్ కు చెందిన 12 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
ఇక టీమ్ యూఎస్ఏ నుంచి 10 మంది ఆటగాళ్లు, ఐర్లాండ్ నుంచి 9 మంది ఆటగాళ్లు, జింబాబ్వే నుంచి 8 మంది ఆటగాళ్లు, కెనడా నుంచి 4 మంది ఆటగాళ్లు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కొక్కరు చొప్పున మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..