
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం అస్సాంలోని గౌహతీలో కేకేఆర్ వర్సెస్ ఆర్‌ఆర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ను కేకేఆర్ పూర్తిగా డామినేట్ చేసి.. విజయం సాధించింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు తొలి విజయం, ఆర్‌ఆర్‌కు వరుసగా రెండో ఓటమి వరించాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని గ్రౌండ్‌లోకి పరిగెత్తుకు వచ్చాడు. నేరుగా వచ్చి ఆ సమయంలో బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. అతన్ని ఆపే ప్రయత్నం కూడా పరాగ్ చేయలేదు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి, ఆ కుర్రాడిని బయటికి తీసుకెళ్లారు.
అంతకంటే ముందు.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లోనూ ఓ అభిమాని ఇలాగే గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ కాళ్లపై పడ్డాడు. అప్పుడు దాన్ని అందరూ కామన్‌గానే చూశారు. గతంలో కూడా కోహ్లీ కోసం చాలా మంది పరిగెత్తుకువచ్చారు. అయితే.. ఇప్పుడు రియాన్ పరాగ్ కోసం ఓ వ్యక్తి రావడం, కాళ్లపై పడటాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఇంకా టీమిండియాకు పట్టుమని పది మ్యాచ్‌లు ఆడలేదు, ఐపీఎల్‌లో కూడా పెద్దగా పొడిచింది ఏమీ లేదు అని క్రికెట్ అభిమానులు కొంతమంది నిన్నటి మ్యాచ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది. ఆ కుర్రాడికి రియాన్ పరాగ్ డబ్బులిచ్చి మరీ.. ఇలా చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేనప్పటికీ.. ప్రస్తుతం రియాన్ పరాగ్‌పై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అస్సాం, రియాన్ పరాగ్ సొంత రాష్ట్రం. మ్యాచ్ కూడా అస్సాంలోని గౌహతీలోనే జరిగింది. సో లోకల్ బాయ్‌గా పరాగ్‌కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఆ విషయం అతను టాస్ కోసం వచ్చిన సమయంలో కూడా అర్థమైంది. పరాగ్ టాస్ కోసం వచ్చిన సమయంలో స్టేడియం మారుమోగిపోయింది. అస్సాం నుంచి టీమిండియాకు ఆడిన తొలి క్రికెటర్‌గా పరాగ్‌కు మంచి క్రేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఎలాంటి క్రేజ్ ఉందో అస్సాంలో పరాగ్‌కు అలాంటి క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ఎలాంటి పీఆర్ స్ట్రాటజీ లేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.