
11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే కాకుండా టాప్-టూలో లీగ్ మ్యాచ్‌లు ఫినిష్ చేసింది. సోమవారం ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ అద్భుతంగా రాణించడంతో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫైయర్ 1 ఆడేందుకు అర్హత సాధించింది. కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ప్రారంభ ఇన్నింగ్స్ మధ్యలో ముంబై యజమాని ఆకాష్ అంబానీ పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన మొదటి ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జరిగింది.
ఆకాష్ అంబానీ ఏదో చెబుతుంటే.. అది వినేందుకు అయ్యర్ అతని వైపు వంగి ఉన్నట్లు ఫొటోలో చూడొచ్చు. అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే తెలియనప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల గురించి ఫన్నీ ఫన్నీ టెక్ట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అయ్యర్‌ను కొనేందుకు, పంజాబ్ నుంచి ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి తీసుకునేందుకు ఆకాశ్ అంబానీ ప్రయత్నిస్తున్నట్లు అందులో చూడొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు పవర్‌ప్లేలో అంత మంచి స్టార్ట్ లభించలేదు.
Akash Ambani and Shreyas Iyer… #PBKSvsMI pic.twitter.com/CzeKLGnioi
— Robin (@robinchopra10) May 26, 2025
కానీ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73), ఆర్య (35 బంతుల్లో 62) కేవలం 59 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ కీలక పార్ట్నర్‌షిప్ పంజాబ్ తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేరుకునేందుకు దోహదపడింది. 2014 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్ కింగ్స్, మే 29న జరగనున్న క్వాలిఫయర్ 1 కోసం ముల్లన్‌పూర్‌లోని తమ సొంత మైదానంలో ఆడనుంది. ముంబై కూడా చండీగఢ్‌లో మే 30న ఎలిమినేటర్ ఆడనుంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌తో పంజాబ్‌తో క్వాలిఫైయర్ 1, ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ ఎవరు ఆడతారో తేలిపోనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తెలిస్తే.. క్వాలిఫైయర్ 1 ఆడుతుంది. ఓడితే ఎలిమినేటర్ ఆడునుంది.
It seems Shreyas Iyer wasn't convinced with the deal Ambani offered…! pic.twitter.com/4JW2OA9pBZ
— Dinda Academy (@academy_dinda) May 26, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..