KKR vs RCB, IPL 2024: అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. సాల్ట్, రస్సెల్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు సమష్ఠిగా రాణించారు. తలా ఒక చేయి వేసి కేకేఆర్ కు భారీ స్కోరు అందించారు. శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్‌ సెంచరీ తో టాప్ స్కోరర్ గా నిలవగా

KKR vs RCB, IPL 2024: అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. సాల్ట్, రస్సెల్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
Shreyas Iyer

Updated on: Apr 21, 2024 | 7:21 PM

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు సమష్ఠిగా రాణించారు. తలా ఒక చేయి వేసి కేకేఆర్ కు భారీ స్కోరు అందించారు. శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్‌ సెంచరీ తో టాప్ స్కోరర్ గా నిలవగా, ఫిలిప్ సాల్ట్ (48), ఆండ్రి రస్సెల్ (27 నాటౌట్), రమణ్‌దీప్ (24 నాటౌట్), రింకు సింగ్ (24) క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ 2, కామెరూన్ గ్రీన్ 2.. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు.

 

ఇవి కూడా చదవండి

అర్ధ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్..

 

రెండు జట్ల ప్లేయింగ్-11

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్, రజత్ పటీదార్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్, స్వప్నిల్ సింగ్.

రమణ్ దీప్ సింగ్ దూకుడు..

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..