RCB Vs CSK: రేయ్ సాంబా రాస్కోరా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం పక్కా.! లెక్కలు ఇవిగో..
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం వేదికగా తలబడనున్నాయి. ఆ వేదికపై ఈ రెండు జట్లు తలబడిన ప్రతీసారి చెన్నై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటిదాకా చెపాక్‌లో సీఎస్‌కే, ఆర్సీబీ కలిసి 8 మ్యాచ్‌లు ఆడగా..

క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం వేదికగా తలబడనున్నాయి. ఆ వేదికపై ఈ రెండు జట్లు తలబడిన ప్రతీసారి చెన్నై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటిదాకా చెపాక్‌లో సీఎస్‌కే, ఆర్సీబీ కలిసి 8 మ్యాచ్‌లు ఆడగా.. అందులో చెన్నై ఏడింట్లో.. బెంగళూరు ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. అలాగే చివరిసారిగా 2019లో జరిగిన మ్యాచ్‌లో కూడా చెన్నై విజయఢంకా మోగించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అనుభవమున్న హార్డ్ హిట్టర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్.. ఇలా ఒకరేంటి అందరూ కూడా టీ20 స్పెషలిస్టులే. ఈసారి కచ్చితంగా చెపాక్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు.
చెన్నై బలహీనత..
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం ఆర్‌సీబీకి సాధ్యం కాదు. అయితే ఈసారి అలా కాదు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందుగా చెన్నైకి పలు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు కీలక బ్యాటర్లు మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేరు. అలాగే బౌలింగ్‌లోనూ చెన్నై కంటే ఆర్సీబీనే పేపర్‌పై గట్టిగా కనిపిస్తోంది. మరోవైపు బ్యాటింగ్ మాత్రమే కాదు.. చెన్నై బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ల ఎకానమీ పెద్ద తలనొప్పిగా మారింది. గాయం నుంచి కోలుకుని చాలాకాలం తర్వాత దీపక్ చాహార్ రీ-ఎంట్రీ ఇస్తుండగా.. శార్దూల్ ఐపీఎల్‌లో 89 వికెట్లు పడగొట్టినా.. ఎకానమీ రేటు 9.16ను దాటుతోంది. ఇది ఆర్‌సీబీకి ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక గత సీజన్‌లో డెత్ ఓవర్లలో డేంజర్‌గా కనిపించిన పతిరానా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అటు డారెల్ మిచెల్, శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ వారి బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపించలేదు. మొత్తంమీద చెన్నై మరోసారి ఆర్సీబీని స్పిన్నర్లతో పడగొట్టేందుకు చూస్తుంది.
ఆర్సీబీకి స్పిన్ పెద్ద బలం..
ఆర్సీబీలో స్పిన్‌ను ఎదుర్కునే ప్లేయర్లు చాలామందే ఉన్నారు. స్పిన్‌లో అన్ని రకాల షాట్‌లను ఆడగలిగే గ్లెన్ మాక్స్‌వెల్. స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కునే కెమెరాన్ గ్రీన్, అలాగే విరాట్ కోహ్లీ స్పిన్‌ను ధీటుగా ఎదుర్కోగలడు. ఇక ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ గురించి స్పిన్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు కూడా సమర్దుడే. సో ఇన్ని పాజిటివ్‌లు ఉన్న నేపధ్యంలో తొలి మ్యాచ్‌లో చెన్నైపై బెంగళూరు విజయం సాధిస్తుందని అందరి అంచనా..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..




