
ఐపీఎల్ 2024 టోర్నీ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . మార్చి 22న ఈ ధనాధాన్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్ టోర్నీకి ముందు ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీల్లో భారీ మార్పులు జరిగాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అంతేకాదు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. దీంతో చాలా రోజుల పాటు ఈ విషయంపై రాద్ధాంతం నడిచింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా చాలా వివరణ ఇచ్చింది. తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మార్క్ బౌచర్ ఇంటర్వ్యూపై రోహిత్ సతీమణి స్పందించడం చర్చకు దారి తీసింది. మార్క్ బౌచర్ మాటల్లో చాలా తప్పులు ఉన్నాయంటూ రితిక సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది.
స్మాష్ స్పోర్ట్స్ ఇంక్‌లో, మార్క్ బౌచర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే రోహిత్ శర్మ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడని చెప్పాడు. అలాగే టీమ్ ఇండియా బాధ్యత కూడా రోహిత్‌పై ఉందని, అందుకే ఈ ఒత్తిడిని తప్పించేందుకు హిట్ మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించామని, అతని స్థానంలో పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించామని బౌచర్ వెల్లడించాడు. అయితే ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూపై రితికా సంచలన కామెంట్లు చేసింది. పాడ్‌కాస్ట్ పేజీలో.. వీడియో కింద ‘ఇందులో చాలా విషయాలు తప్పు’ అని రోహిత్ భార్య రితిక కామెంట్ చేసింది. దీనిని బట్టి చూస్తే.. హార్దిక్ పాండ్యను కెప్టెన్సీ అప్పగించే విషయంలో రోహిత్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Ritika Sajdeh’s comment on Mark Boucher’s interview talking about Hardik Pandya taking over MI captaincy. (Smash Sports Podcast). pic.twitter.com/5sAAVa5xVu
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.