IPL 2024 32వ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ నమ్మశక్యంగాని రీతిలో అందుకున్నాడు పంత్. అలాగే రెండు మెరుపు స్టంపింగ్‌లు కూడా చేశారు. అహ్మదాబాద్‌లోని పిచ్‌పై గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు . అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బాగా ఫీల్డింగ్ చేస్తూ గుజరాత్ కష్టాలను మరింత పెంచింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ అద్భుతంగా అందుకున్నాడు. ఐదో ఓవర్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లెగ్ సైడ్ దిశగా డేవిడ్ మిల్లర్ ఆడిన షాట్‌ను పంత్ అద్భుతమైన డైవిండ్ క్యాచ్‌గా మలిచి అభిమానుల మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుంది.
డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టిన తర్వాత రిషబ్ పంత్ మరో 2 స్టంపింగ్స్ చేశాడు. 9వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌ను రిషబ్ స్టంపౌట్ చేశాడు. అభినవ్ ముందుకు వచ్చి స్టబ్స్ వేసిన బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయ్యింది. మనోహర్ తేరుకునేలోపే వికెట్లను గిరాటేశాడు పంత్. ఆ తర్వాత స్టబ్స్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కి లెగ్ స్టంప్ వెలుపల ఒక వైడ్ బాల్ వేశాడు. షాట్ ఆడేందుకు షారుఖ్ ప్రయత్నించగా పంత్ స్టంప్ అవుట్ చేశాడు. అప్పటికీ షారుఖ్ కాలు గాలిలోనే ఉంది.
Commitment 💯
Execution 💯
Athleticism 💯Delhi Capitals are making the most of the chances with some brilliant fielding 👌👌#GT are 4 down for 30 in the Powerplay!
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/wlh2FCg3WJ
— IndianPremierLeague (@IPL) April 17, 2024
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఈ టోర్నీ లోనే పునరాగమనం చేశాడు. ఇప్పటికే బ్యాట్ తో అదరగొట్టిన పంత్ ఇప్పుడు తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ప్రపంచ కప్ లో బెర్తు కన్ఫార్మ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు.
I.C.Y.M.I
𝗜𝗻 𝗮 𝗙𝗹𝗮𝘀𝗵 ⚡️
Quick Hands from Rishabh Pant helps Tristan Stubbs join the wicket taking party 👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/k8o8VPY2dk
— IndianPremierLeague (@IPL) April 17, 2024
— Kirkit Expert (@expert42983) April 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..