IPL 2024 Final Match Schedule: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ జరిగేది ఎక్కడంటే?

IPL 2024 Final Match Schedule Update: స్పోర్ట్‌స్టాక్‌ అందించిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలో జరగనుంది. అయితే దీనికి ముందు చెన్నై, అహ్మదాబాద్‌లలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం సిద్ధంగా లేనందున విశాఖపట్నం మైదానంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీని తర్వాత ఢిల్లీ జట్టు ఏడు మ్యాచ్‌లలో చివరి 5 మ్యాచ్‌లను ఢిల్లీలోనే ఆడగలదు.

IPL 2024 Final Match Schedule: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ జరిగేది ఎక్కడంటే?
Ipl 2024

Updated on: Mar 24, 2024 | 9:46 AM

IPL 2024 Final Match Schedule Update: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల కారణంగా బీసీసీఐ ఏప్రిల్ 7వ తేదీ వరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ షెడ్యూల్, ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫైనల్ మ్యాచ్, ప్లేఆఫ్‌లు ఈసారి ఏ మైదానంలో జరుగుతాయనేది ఇందులో స్పష్టమైంది.

ఐపీఎల్ 2024 ఫైనల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్..

స్పోర్ట్‌స్టాక్‌ అందించిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలో జరగనుంది. అయితే దీనికి ముందు చెన్నై, అహ్మదాబాద్‌లలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం సిద్ధంగా లేనందున విశాఖపట్నం మైదానంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీని తర్వాత ఢిల్లీ జట్టు ఏడు మ్యాచ్‌లలో చివరి 5 మ్యాచ్‌లను ఢిల్లీలోనే ఆడగలదు. పంజాబ్ కింగ్స్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లను మోహల్‌లోని కొత్త స్టేడియంలో ఆడనుంది. రెండు మ్యాచ్‌లు ధర్మశాల మైదానంలో ఆడనుంది.

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుంది?

ఐపీఎల్ 2024 సీజన్ గురించి మాట్లాడితే, బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో 10 నగరాల్లో 17 రోజుల పాటు మొత్తం 21 మ్యాచ్‌లు జరగనుండగా, మార్చి 22 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది భారతదేశంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ తదుపరి షెడ్యూల్‌ను బోర్డు ఇంకా ప్రకటించలేదు. స్పోర్ట్‌స్టాక్‌కి అందిన సమాచారం ప్రకారం, తదుపరి షెడ్యూల్‌ను మార్చి 25న ప్రకటించవచ్చని తెలుస్తోంది.

IPL 2024 షెడ్యూల్:-

22 మార్చి CSK vs RCB చెన్నై (చెన్నై విజయం)

23 మార్చి PBKS vs DC మొహాలి (పంజాబ్ విజయం)

23 మార్చి KKR vs SRH కోల్‌కతా (కోల్‌కతా విజయం)

24 మార్చి RR vs LSG జైపూర్

24 మార్చి GT vs MI అహ్మదాబాద్

25 మార్చి RCB vs PBKS బెంగళూరు

26 మార్చి CSK vs GT చెన్నై

27 మార్చి SRH vs MI హైదరాబాద్

28 మార్చి RR vs DC జైపూర్

29 మార్చి RCB vs KKR బెంగళూరు

30 మార్చి LSG vs PBKS లక్నో

31 మార్చి GT vs SRH అహ్మదాబాద్

31 మార్చి DC vs CSK వైజాగ్

1 ఏప్రిల్ MI vs RR ముంబై

2 ఏప్రిల్ RCB vs LSG బెంగళూరు

3 ఏప్రిల్ DC vs KKR వైజాగ్

4 ఏప్రిల్ GT vs PBKS అహ్మదాబాద్

5 ఏప్రిల్ SRH vs CSK హైదరాబాద్

6 ఏప్రిల్ RR vs RCB జైపూర్

7 ఏప్రిల్ MI vs DC ముంబై

7 ఏప్రిల్ LSG vs GT లక్నో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..