Suryakumar Yadav Century: వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వెటరన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇప్పుడు పెద్ద రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల పరంగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. ఇప్పుడు సూర్య కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ముందున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు ఒంటరిగా జట్టును గెలిపించాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.
భారత్ తరపున టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది ఆరో సెంచరీ కాగా, ఈ విషయంలో అతను కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను సమం చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా తలో 6 సెంచరీలు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మరో సెంచరీ సాధిస్తే భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందుంటాడు.
𝗦.𝗞.𝗬 𝗰𝗹𝗮𝘀𝘀𝗶𝗰 𝗶𝗻 𝗪𝗮𝗻𝗸𝗵𝗲𝗱𝗲 👌
2️⃣nd #TATAIPL 💯 for Suryakumar Yadav 👏👏
Follow the Match ▶️ https://t.co/iZHeIP3ZRx#TATAIPL | #MIvSRH pic.twitter.com/fkGE19HMUQ
— IndianPremierLeague (@IPL) May 6, 2024
ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ రికార్డును కూడా సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ తరపున రెండు సెంచరీలు సాధించారు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లు సంయుక్తంగా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
IPL 2024 లో, సోమవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..