ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (ఏప్రిల్ 07) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 234 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసింది. ముంబై నుంచి రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (39), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్ (39) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ కు ఢిల్లీపై విజయం భారీ ఊరట నిచ్చింది. ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ జట్టు అభిమానుల్లో ఒక సందేహం మెదులుతోంది. అదేంటంటే.. హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడ్డాడా? ఈ కారణంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో పాండ్యా బౌలింగ్ చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
గతేడాది వన్డే ప్రపంచకప్ 2023లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను నేరుగా IPL 2024లో తిరిగి వచ్చాడు. అయితే ఢిల్లీతో మ్యాచ్ కు ముందు బౌలింగ్ వేసిన పాండ్యా ఆదివారం నాటి మ్యాచ్ లో మాత్రం అసలు ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయాడు. దీంతో పాండ్యా గాయపడ్డాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు ముంబై కెప్టెన్.
“నేను బాగానే ఉన్నాను. సరైన సమయంలో బౌలింగ్ చేస్తాను. ఆదివారం మ్యాచ్ లో అంతా బాగానే జరిగింది. అందుకే బౌలింగ్ చేయలేదు’ అని మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా అన్నాడు. ముంబై ఇండియన్స్ విజయంలో నిజమైన హీరో రొమారియో షెపర్డ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చివరి 10 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ స్కోరు 234కి చేరింది. రొమారియో షెపర్డ్ మొత్తం నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.
𝙎𝙡𝙖𝙮 𝙩𝙤𝙜𝙚𝙩𝙝𝙚𝙧, 𝙨𝙩𝙖𝙮 𝙩𝙤𝙜𝙚𝙩𝙝𝙚𝙧! 🤝
P.S.: @ishankishan51, kiski nakal ho rahi hai? 👀🫣#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/BqgUS3yaKq
— Mumbai Indians (@mipaltan) April 8, 2024
#ESADay was all about good vibes, wide smiles, and loud cheers 💙#MumbaiMeriJaan #MumbaiIndians #EducationAndSportsForAll | @ril_foundation pic.twitter.com/7XBJ9KQOy0
— Mumbai Indians (@mipaltan) April 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..