
Kolkata Knight Riders vs Mumbai Indians : IPL 2024 సీజన్ 2024 లో భాగంగా 60వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 170 పరుగుల టార్గెట్ ను విధించింది. కానీ ముంబై జట్టు ఈ పరుగులు కూడా చేయలేకపోయింది. 145 పరుగుల వద్దే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతా 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింఇ. ఇప్పుడు టోర్నీలో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. అయితే టోర్నీలో పరువు దక్కించుకోవడానికైనా ఆ జట్టు ఇప్పుడు విజయం సాధించడం తప్పనసరి. పైగా ఆజట్టుపై ఇప్పుడు ఎలాంటి అంచనాలు, ఒత్తిడి లేవు. కాబట్టి తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. కోల్‌కతా, ముంబై జట్లు 33 సార్లు తలపడ్డాయి. ముంబై 23 సార్లు గెలుపొందగా, కోల్‌కతా 10 సార్లు గెలిచింది. ఈడెన్ గార్డెన్‌లో 10 మ్యాచ్‌లు జరిగాయి, ఇందులో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా 3 మ్యాచ్‌లు గెలిచింది. కోల్‌కతా ఈ మైదానంలో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడింది. 51 మ్యాచ్‌లు గెలిచి 36 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ టై అయింది.
కాగా ఈడెన్ గార్డెన్ లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. సిబ్బంది మైదానాన్ని అంతటిని తెల్లటి కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగినా.. కవర్లపై నీరు నిలవడంతో స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. మరికాసేపట్లో మ్యాచ్ కు సంబంధించి పూర్తి అప్ డేట్ ఇవ్వనున్నారు అంపైర్లు
🚨 Update from Kolkata 🚨
The covers are on and toss has been delayed due to rain 🌧️
Stay tuned for further updates
Follow the Match ▶️ https://t.co/4BkBwLMkq0#TATAIPL | #KKRvMI pic.twitter.com/R5eazERsfr
— IndianPremierLeague (@IPL) May 11, 2024
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వాద్రా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా
ఇంపాక్ట్ ప్లేయర్స్: పీయూష్ చావ్లా
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
ఇంపాక్ట్ ప్లేయర్స్: వైభవ్ అరోరా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..