IPL 2024: బెంగళూరు అడ్డాలో కోల్‌కత్తా దూకుడు.. కట్‌చేస్తే ఓటమిలో ఆర్‌సీబీ డబుల్ హ్యాట్రిక్..

|

Mar 30, 2024 | 1:29 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 10వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ జట్టు 16.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

IPL 2024: బెంగళూరు అడ్డాలో కోల్‌కత్తా దూకుడు.. కట్‌చేస్తే ఓటమిలో ఆర్‌సీబీ డబుల్ హ్యాట్రిక్..
Rcb Vs Kkr Records
Follow us on

RCB vs KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజయ పరంపర కొనసాగింది. తొలి ఐపీఎల్‌తోనే ఈ జోరు ప్రారంభం కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే, 2008లో RCB చేతిలో 140 పరుగుల ఘోర పరాజయంతో IPL ప్రచారాన్ని ప్రారంభించిన KKR.. ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో బలమైన జట్టుగా గుర్తింపు పొందింది.

ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. చిన్నస్వామి స్టేడియంలో RCB, KKR 12 సార్లు తలపడ్డాయి. ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 సార్లు మాత్రమే గెలిచింది అంటే నమ్మాల్సిందే.

అంటే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 సార్లు RCB జట్టు సొంత మైదానంలో గెలిచింది. ఆశ్చర్యకరంగా, 2015 నుంచి చిన్నస్వామి స్టేడియంలో KKRపై RCB ఒక్క విజయం కూడా సాధించలేదు. అంటే, వరుసగా 6 పరాజయాలు.

ఇవి కూడా చదవండి

2010లో చిన్నస్వామి స్టేడియంలో RCB తొలి విజయం సాధించింది. దీని తర్వాత 2011, 2013లో విజయాన్ని నమోదు చేయడంలో సఫలమైంది. ఆ తర్వాత 2015లో గెలిచారు. ఇదే ముగింపు. ఆ తర్వాత ఆర్సీబీ జట్టు సొంతగడ్డపై కేకేఆర్ జట్టును ఓడించలేకపోవడం ఆశ్చర్యకరం.

KKR 2008లో మొదటిసారి RCBని ఓడించింది. ఆ తర్వాత 2012, 2016, 2017, 2018, 2019, 2023, ఇప్పుడు 2024లో గెలిచింది. దీని ద్వారా ఆర్సీబీ జట్టు హోమ్ గ్రౌండ్‌లో కేకేఆర్ జట్టు సంబరాలు చేసుకుంది.

ఈసారి కూడా అలాగే కొనసాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్‌గా మారింది. ఈ మైదానంలో జరిగిన గత 6 మ్యాచ్‌ల్లో ఆర్సీబీపై కేకేఆర్ జట్టు విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం.

ఇరు జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్(కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్(కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్‌లు: సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, మనీష్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, రహ్మానుల్లా గుర్బాజ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సబ్‌లు: మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..