AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs KKR: ఇలాంటి వాళ్లతో బెంగళూరు ఈసారి కూడా ట్రోఫీ గెలవలేదు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

RCB vs KKR, IPL 2024: పవర్‌ప్లే ఓవర్లలో డు ప్లెసిస్ స్పిన్నర్లను తీసుకరాలేదు. మహ్మద్ సిరాజ్ తన మొదటి ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్ దూకుడుతో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో సహా 18 పరుగులు ఇచ్చాడు. సునీల్ నరైన్ కూడా అల్జారీ జోసెఫ్‌పై రెండు సిక్సర్లను బాదేశాడు. అతను యశ్ దయాల్ తర్వాత ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. పవర్‌ప్లే ఓవర్ల తర్వాత KKR వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.

RCB vs KKR: ఇలాంటి వాళ్లతో బెంగళూరు ఈసారి కూడా ట్రోఫీ గెలవలేదు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
Rcb
Venkata Chari
|

Updated on: Mar 30, 2024 | 2:02 PM

Share

RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఎం.చిన్నస్వామి స్టేడియంలో మార్చి 29న జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లను చిత్తుగా దంచి కొట్టారు. KKR 183 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో ఛేదించింది. RCB పేసర్లు తన నాలుగు ఓవర్ల కోటా నుంచి 23 పరుగులు ఇచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ విజయ్‌కుమార్ వైషాక్‌ను మినహాయిస్తే.. పేలవంగా తయారయ్యారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ KKRపై ఆర్‌సీబీ ప్రదర్శన తర్వాత హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి బౌలింగ్‌తో ఫాఫ్ డు ప్లెసిస్ వారి ఐపీఎల్ ట్రోఫీ కరువును ముగించడం ‘అసాధ్యం’ అంటూ చెప్పేశాడు.

“ఈ బౌలింగ్ దాడితో @RCBTweets IPL గెలవడం అసాధ్యం” అని వాన్ ‘X’లో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ RCB బౌలింగ్ ఎటాక్ ఆకట్టుకోలేకపోయింది. వారు త్వరగా సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

“RCB నిజంగా వారి బౌలింగ్‌ను క్రమబద్ధీకరించాలి” అంటూ పఠాన్ X లో రాసుకొచ్చాడు.

పవర్‌ప్లే ఓవర్లలో డు ప్లెసిస్ స్పిన్నర్లను తీసుకరాలేదు. మహ్మద్ సిరాజ్ తన మొదటి ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్ దూకుడుతో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో సహా 18 పరుగులు ఇచ్చాడు. సునీల్ నరైన్ కూడా అల్జారీ జోసెఫ్‌పై రెండు సిక్సర్లను బాదేశాడు. అతను యశ్ దయాల్ తర్వాత ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. పవర్‌ప్లే ఓవర్ల తర్వాత KKR వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.

వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ తిరిగి పునరాగమనం చేయలేకపోయింది. జోసెఫ్ తిరిగి వచ్చాడు. కానీ, వెంకటేష్ అయ్యర్ దెబ్బకు రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు ఇచ్చేశాడు. సిరాజ్ మూడు ఓవర్లలో 46 పరుగులు చేశాడు. దయాల్ తన నాలుగు ఓవర్ల కోటాలోనూ ఇలాగే దెబ్బతిన్నాడు. జోసెఫ్ కేవలం రెండు ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. కామెరాన్ గ్రీన్ అతను వేసిన ఒకే ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

పవర్‌ప్లే ఓవర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ మయాంక్ డాగర్‌ను ప్రవేశపెట్టకూడదనే తన నిర్ణయాన్ని డు ప్లెసిస్ సమర్థించుకున్నాడు.

“ఆట ముగిసిన తర్వాత మీరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. మేం బహుశా ఒకటి లేదా రెండు విషయాలను ప్రయత్నించవచ్చు. కానీ వారిద్దరూ (నరైన్, సాల్ట్) బంతిని కొట్టే విధానం మా బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. వారు బలమైన క్రికెట్ షాట్లను ఆడారు. చాలా చక్కని ఆటతో మాకు విజయాన్ని దూరం చేశారు. మొదటి ఆరు ఓవర్లలో ఆటను నిజంగా బ్రేక్ చేశారు” అంటూ మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ సారథి చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..