IPL 2024: స్టార్క్ కంటే 123 రెట్లు తక్కువ.. పేస్ గన్ మయాంక్ యాదవ్‌ ధర మరీ అంత తక్కువా?

|

Apr 04, 2024 | 6:54 PM

IPL 2024 ప్రారంభమై 10 రోజులకు పైనే గడిచింది. అయితే ఈ 10 రోజుల్లో ఒకరి పేరు ఎక్కువగా చర్చనీయాంశమైంది. అదే మయాంక్ యాదవ్. ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు తన మెరుపు బౌలింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. వేగంతో పాటు కచ్చితత్వంతో పాటు బంతులు విసురుతూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు.

IPL 2024: స్టార్క్ కంటే 123 రెట్లు తక్కువ.. పేస్ గన్ మయాంక్ యాదవ్‌ ధర మరీ అంత తక్కువా?
Mayank Yadav, Mitchell Starc
Follow us on

IPL 2024 ప్రారంభమై 10 రోజులకు పైనే గడిచింది. అయితే ఈ 10 రోజుల్లో ఒకరి పేరు ఎక్కువగా చర్చనీయాంశమైంది. అదే మయాంక్ యాదవ్. ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు తన మెరుపు బౌలింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. వేగంతో పాటు కచ్చితత్వంతో పాటు బంతులు విసురుతూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇంతలా మెరుపులు మెరిపిస్తోన్న ఈ మయాంక్ యాదవ్ ను ఐపీఎల్ లో లక్నో ఎంతకు కొనుగోలు చేసిందో తెలుసా? జస్ట్ రూ.20లక్షలు మాత్రమే. పంజాబ్ కింగ్స్‌పై అరంగేట్రం చేసిన మయాంక్ తన సూపర్ స్పెల్‌ తో అందరి నోళ్లను ఆపేశాడు. ముఖ్యంగా 155.8 కిలోమీటర్ల వేగంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను బౌల్డ్ చేసిన తీరు హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు మయాంక్.

ఇక రెండో మ్యాచ్ లోనూ గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి కొత్త రికార్లు నెలకొల్పాడు . ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడీ స్పీడ్ గన్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడు మయాంక్ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

 

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ 2024 వేలంలో అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.70 కోట్లకు కొనుగోలు చేసింది. అతను ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడాడు. 2 వికెట్లు మాత్రమే తీశాడు. మొదటి రెండు మ్యాచుల్లో 47, 53 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్‌లో మయాంక్ యాదవ్ జీతం మిచెల్ స్టార్క్ కంటే 123 రెట్లు తక్కువ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..