IPL 2024: ‘ప్లేయింగ్ 11 నుంచి నన్ను తప్పించండి.. నావల్ల కావట్లే’: ఫ్రాంచైజీకి షాకిచ్చిన రూ.11 కోట్ల ఆర్‌సీబీ ప్లేయర్..

Royal Challengers Bengaluru: ఈ డేంజరస్ ప్లేయర్ 28 స్కోరుతో ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకున్నాడు. ప్రస్తుత T20 లీగ్‌లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, మిడిల్ ఆర్డర్‌లో RCB వేరే ఎంపికను పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని మాక్స్‌వెల్ అంగీకరించాడు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని, మరింత కష్టాల్లో కూరుకుపోకూడదని మ్యాక్స్‌వెల్ అన్నాడు.

IPL 2024: 'ప్లేయింగ్ 11 నుంచి నన్ను తప్పించండి.. నావల్ల కావట్లే': ఫ్రాంచైజీకి షాకిచ్చిన రూ.11 కోట్ల ఆర్‌సీబీ ప్లేయర్..
RCB Team
Follow us

|

Updated on: Apr 16, 2024 | 1:34 PM

Glenn Maxwell: ఐపీఎల్ 2024 (IPL 2024)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 5వ ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో RCB అభిమానులు జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఇంతలో, జట్టులోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్, గ్లెన్ మాక్స్‌వెల్ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏప్రిల్ 15, సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ నుంచి తనను తొలగించాలని RCB టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు గ్లెన్ మాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో, RCB తన ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చేసింది. విల్ జాక్వెస్, లాకీ ఫెర్గూసన్, రీస్ టోప్లీలను ప్లేయింగ్ 11 లో చేర్చింది. మాక్స్‌వెల్ చాలా పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ బ్యాట్స్‌మన్ 6 మ్యాచ్‌లలో 5.33 సగటు, 94.11 స్ట్రైక్-రేట్‌తో 32 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ డేంజరస్ ప్లేయర్ 28 స్కోరుతో ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకున్నాడు. ప్రస్తుత T20 లీగ్‌లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, మిడిల్ ఆర్డర్‌లో RCB వేరే ఎంపికను పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని మాక్స్‌వెల్ అంగీకరించాడు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని, మరింత కష్టాల్లో కూరుకుపోకూడదని మ్యాక్స్‌వెల్ అన్నాడు.

కెప్టెన్, కోచ్‌తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం..

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో, మాక్స్‌వెల్ మాట్లాడుతూ, “నాకు వ్యక్తిగతంగా ఇది చాలా సులభమైన నిర్ణయం. నేను చివరి మ్యాచ్ తర్వాత ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్ వద్దకు వెళ్లి, బహుశా ఇప్పుడు సమయం వచ్చిందని భావిస్తున్నాను. హైదరాబాద్ మ్యాచ్‌తో నన్ను తప్పించి, ఆస్థానంలో మరొకరిని ఆడించడం ఉత్తమం అంటూ చెప్పినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నాకు విశ్రాంతి కావాలి: మాక్స్‌వెల్

మాక్స్‌వెల్ మాట్లాడుతూ, “ఇప్పుడు నేను నిజంగా మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తప్పులను కరెక్ట్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం. టోర్నీ సందర్భంగా మళ్లీ నన్ను జట్టులోకి తీసుకోవలసి వస్తే మానసికంగా, శారీరకంగా మంచి స్పేస్‌తో జట్టులోకి వస్తాను. ఈ విధంగా నేను మళ్లీ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు.

మాక్స్‌వెల్ మాట్లాడుతూ, “పవర్‌ప్లే తర్వాత వెంటనే మాకు భారీ లోటు ఉంది. ఇది గత కొన్ని సీజన్‌లలో నా బలం. నేను బ్యాట్‌తో సానుకూలంగా ఆడగలిగానని భావించాను. ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మరొక అవకాశం ఇవ్వడం మంచిది’ అన్నాడు.

ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేసిన మార్పులు ప్రయోజనం లేకపోగా, సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 288 పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. 7 మ్యాచ్‌లలో 6 ఓడిపోయిన డు ప్లెసిస్ జట్టు 2 పాయింట్లు, నెట్ రన్ రేట్ -1.185తో పట్టికలో అట్టడుగున ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles