KKR vs SRH, IPL 2024 Final: చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

|

May 26, 2024 | 9:39 PM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ పదునైన బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర తంటాలు పడ్డారు. ఎస్ ఆర్ హెచ్ కనీసం పూర్తి 20 ఓవర్ల కోటా కూడా ఆడలేకపోయింది

KKR vs SRH, IPL 2024 Final: చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
KKR vs SRH, IPL 2024 Final
Follow us on

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ పదునైన బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర తంటాలు పడ్డారు. ఎస్ ఆర్ హెచ్ కనీసం పూర్తి 20 ఓవర్ల కోటా కూడా ఆడలేకపోయింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (24), ఐడాన్ మార్క్రామ్ (20) మాత్రమైనా కాసిన్ని పరుగులు చేయడంతో హైదరాబాద్ 100 పరుగుల మార్క్ దాటింది. చివరకు ఎస్ఆర్ హెచ్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. . కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెస్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్,  హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు తీశారు. సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ కాపాడుకుంటుందో లేదో మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది.

టాప్ స్కోరర్ గా కెప్టెన్ కమిన్స్..

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రకాష్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్,  వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..