PBKS vs RCB, IPL 2024: పంజాబ్‌తో చావో రేవో.. టాస్ ఓడిన ఆర్సీబీ.. స్టార్ ప్లేయర్ దూరం

Punjab Kings vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో 58వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది

PBKS vs RCB, IPL 2024: పంజాబ్‌తో చావో రేవో.. టాస్ ఓడిన ఆర్సీబీ.. స్టార్ ప్లేయర్ దూరం
PBKS vs RCB Today IPL Match

Updated on: May 09, 2024 | 7:24 PM

Punjab Kings vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో 58వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ గేమ్ లో ఓడిన జట్టు ఐపీఎల్ లో తమ ప్రయాణం ముగించినట్లే. ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. ఓడిన జట్టుకు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉంటాయి. అంటే గరిష్టంగా 12 పాయింట్లు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్లే ఆఫ్‌ అర్హతకు  సరిపోదు. కాబట్టి ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ముందుకు వచ్చింది. కాగా పంజాబ్‌, ఆర్‌సీబీ రెండూ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయాయి

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లక్కీ ఫెర్గూసన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, విజయ్‌కుమార్ వైషాక్, యష్ దయాల్, మయాంక్ దాగర్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలే రూసో, శశాంక్ సింగ్, సామ్ కరణ్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కవీరప్ప.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

హర్‌ప్రీత్ బ్రార్, తనయ్ త్యాగరాజన్, రిషి ధావన్, జితేష్ శర్మ, నాథన్ ఎల్లిస్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us