
Mumbai Indians vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల కు ఇది 14వ మ్యాచ్ అలాగే ఆఖరి గేమ్. అందుకే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ముగించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఈ సీజన్‌లో ముంబై మొత్తం 13 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. 7 సార్లు ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై పదో స్థానంలో ఉంది. ముంబై vs లక్నో మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. అందులో లక్నో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది.
కాగా లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
🚨 Toss Update 🚨@mipaltan elect to bowl against @LucknowIPL
Follow the Match https://t.co/VuUaiv5dPT#TATAIPL | #MIvLSG pic.twitter.com/iSYDcNmMtT
— IndianPremierLeague (@IPL) May 17, 2024
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వాద్రా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా.
రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
నవీన్-ఉల్-హక్, ఆష్టన్ టర్నర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్
Special moment for @surya_14kumar 🥳
He is set to appear in his 1️⃣5️⃣0️⃣th IPL match 👏
How many runs will he score tonight? 🤔
Follow the Match https://t.co/VuUaiv4G0l#TATAIPL | #MIvLSG pic.twitter.com/1LzkxQpROw
— IndianPremierLeague (@IPL) May 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..