DC vs LSG, IPL 2024: లక్నోతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. పంత్ మళ్లీ వచ్చేశాడు

|

May 14, 2024 | 7:22 PM

Delhi Capitals vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ సీజన్ 2024 64వ మ్యాచ్ లో భాగంగా మంగళవారం (మే 14) లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీకి ఇది డూ ఆర్ డై మ్యాచ్.

DC vs LSG, IPL 2024: లక్నోతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. పంత్ మళ్లీ వచ్చేశాడు
DC vs LSG, IPL 2024
Follow us on

Delhi Capitals vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ సీజన్ 2024 64వ మ్యాచ్ లో భాగంగా మంగళవారం (మే 14) లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీకి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ జట్టు ఓడిపోతే ప్లే ఆఫ్ రేసుకు దూరమవుతుంది. ఢిల్లీ, లక్నోలు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీకి ఇది 14వ మ్యాచ్‌ కాగా, లక్నోకు 13వ మ్యాచ్‌. ప్రస్తుతానికి  ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండూ ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఢిల్లీ కంటే లక్నో సూపర్ జెయింట్‌కే ప్లే ఆఫ్‌కు ఎక్కువ అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలిస్తే 14 పాయింట్లు వస్తాయి. అలాగే తదుపరి మ్యాచ్‌లో 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్‌లో ఆడే అవకాశం ఉంటుంది. అయితే మిగతా జట్ల ప్రదర్శనపై అంతా ఆధారపడి ఉంటుంది. కాగా, ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కాగా ఆ ఈ మ్యాచ్ లో లక్నో సూపర్‌ జెయింట్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

 

 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్ /వికెట్ కీపర్) , ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

KL రాహుల్ (కెప్టెన్ /వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

మణిమారన్ సిద్ధార్థ్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..