Punjab Kings vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 33వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడడం లేదు. దీంతో పంజాబ్ కింగ్స్‌కు సామ్ కరన్ నాయకత్వం వహిస్తుండగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది. పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వీందర్ సింగ్ అంతర్జాతీయ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. లీగ్‌లో పంజాబ్, ముంబై జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో ఓడిపోయాయి. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ, రన్ రేట్ పరంగా ముంబై ఇండియన్స్ కంటే పంజాబ్ కింగ్స్ మెరుగ్గా ఉంది. ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇక ఐపీఎల్‌లో ఇరు జట్లు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 16 సార్లు గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ 15 సార్లు గెలిచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అంటే మొదట ముంబై బ్యాటింగ్ కు దిగనుంది.
🚨 Toss Update 🚨
Punjab Kings win the toss and elect to bowl against Mumbai Indians.
Follow the Match ▶️ https://t.co/m7TQkWeGn7#TATAIPL | #PBKSvMI pic.twitter.com/soKlffZDxX
— IndianPremierLeague (@IPL) April 18, 2024
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రిలే రోసో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్
🚨 Milestone Alert 🚨
Rohit Sharma is all set to play his 2⃣5⃣0⃣th IPL Match 👏👏
A Hitman special on the cards in Mullanpur? 😉
Follow the Match ▶️ https://t.co/m7TQkWeGn7#TATAIPL | #PBKSvMI pic.twitter.com/vddEj40hUt
— IndianPremierLeague (@IPL) April 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి