IPL 2024 Auction: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా మహిళా ఆక్షనీర్‌.. ఇంతకీ ఎవరీ మల్లికా సాగర్‌?

|

Dec 18, 2023 | 6:11 PM

16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఐపీఎల్‌ వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లిక గుర్తింపు పొందనుంది. మల్లికా సాగర్ గతంలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంది. WPL-2023, 2024 రెండు సీజన్లతో పాటు కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలు నిర్వహించారు మల్లిక. ఇప్పుడీ అనుభవంతోనే ఏకంగా ఐపీఎల్‌ ఆక్షన్‌ నిర్వహించేందుకూ సై అంటుందామె

IPL 2024 Auction: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా మహిళా ఆక్షనీర్‌.. ఇంతకీ ఎవరీ మల్లికా సాగర్‌?
Mallika Sagar
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మంగళవారం ( డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకా కోలా అరేనాలో ఐపీఎల్‌ బిడ్డింగ్‌ జరగనుంది. భారత, విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 333 మంది ఆటగాళ్లు ఈ వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందులో భారత్ నుంచి 214 మంది ఆటగాళ్లు ఉండగా.. విదేశాల నుంచి 119 మంది క్రికెటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే వేలానికి ఒక రోజు ముందు ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌లో మల్లికా సాగర్ కూడా భాగం కానుంది. దీంతో 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఐపీఎల్‌ వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లిక గుర్తింపు పొందనుంది. మల్లికా సాగర్ గతంలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంది. WPL-2023, 2024 రెండు సీజన్లతో పాటు కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలు నిర్వహించారు మల్లిక. ఇప్పుడీ అనుభవంతోనే ఏకంగా ఐపీఎల్‌ ఆక్షన్‌ నిర్వహించేందుకూ సై అంటుందామె. “ప్రొఫెషనల్ ఆక్షన్‌ మల్లికా సాగర్ ఈ సారి ఐపీఎల్‌ మినీ వేలం నిర్వహిస్తారు’ అని ఈ మేరకు బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది.

ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి 2018 వరకూ ఆటగాళ్ల వేలం ప్రక్రియను రిచర్డ్ మ్యాడ్లీ నిర్వహించారు. ఆ తర్వాత 2023 వరకూ హ్యూజ్ ఎడ్మియేడ్స్ ఐపీఎల్ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. 2022 మెగా వేలం సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వేలం మధ్యలోనే ఎడ్మియేడ్స్ ఆస్పత్రి పాలయ్యారు. దీంతో భారతదేశానికి చెందిన చారు శర్మ వేలం ప్రక్రియను కొనసాగించారు. ఇప్పుడు ఆ బాధ్యతలను మల్లికా సాగర్‌ నిర్వహించనుంది. ముంబైకి చెందిన ఆర్ట్ కలెక్టర్ అయిన మల్లికకు ఆధునిక, సమకాలీన భారత కళల్లో ప్రావీణ్యముంది. ముంబైలోని ప్రముఖమైన పండోలి ఆర్ట్ గ్యాలరీస్‌‌లోనూ వేలం నిర్వహించిన అనుభవం ఆమెకుంది. 26 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి వేలం ప్రక్రియను నిర్వహించారు. సమకాలీన ఇండియన్ ఆర్ట్ వేలం ప్రక్రియను నిర్వహించిన తొలి వ్యక్తి మల్లికనే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

కబడ్డీ ప్రీమియర్ లీగ్ వేలంలోనూ..

మహిళల ప్రీమియర్ లీగ్ వేలం నిర్వాహకురాలిగా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..