SRHకి శనిలా దాపురించింది ఆ ప్లేయర్లే.. ఈ పాపానికి కమిన్స్ భయ్యా కూడా బాధ్యుడే.!

|

May 29, 2024 | 12:52 PM

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేకేఆర్.. హైదరాబాద్ జట్టును చిత్తుగా ఓడించి.. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్..

SRHకి శనిలా దాపురించింది ఆ ప్లేయర్లే.. ఈ పాపానికి కమిన్స్ భయ్యా కూడా బాధ్యుడే.!
Srh
Follow us on

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేకేఆర్.. హైదరాబాద్ జట్టును చిత్తుగా ఓడించి.. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న తలతిక్క నిర్ణయాల వల్లే జట్టు ఓటమిపాలైందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరుసగా అట్టర్ ప్లాప్ షో కొనసాగిస్తున్న ఆ ఇద్దరు ప్లేయర్స్‌ను నెత్తిన పెట్టుకుని.. మ్యాచ్ విన్నర్ అయిన ఆటగాడిని టోర్నీ అంతటా బెంచ్‌కే పరిమితం చేశారని తిట్టిపోస్తున్నారు. దీంతో ఫైనల్‌లో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. వాళ్లిద్దరూ మరెవరో కాదు అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్‌రమ్.

కోట్లు ఖర్చయినా కూడా.. అబ్దుల్ సమద్‌ను జట్టుతోనే అట్టిపెట్టేసుకుంది కావ్య మారన్. అయితే అతడు మాత్రం జట్టుకు అవసరమైనప్పుడు.. దూకుడైన ఆటతీరును కనబరచలేదు. ఇక మరో ప్లేయర్ ఐడెన్ మార్క్‌రమ్.. ఐపీఎల్ 2024 సీజన్‌లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 మ్యాచుల్లో కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కీలక మ్యాచ్‌లో డకౌట్ కాగా.. ఫైనల్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇవి కూడా చదవండి

మార్క్‌రమ్‌ ఆటతీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. అట్లాంటి చెత్తాట తాము ఎప్పుడూ చూడలేదని.. అతడి కంటే గల్లీ క్రికెటర్ నయమని కామెంట్స్ చేస్తున్నారు. గ్లెన్ ఫిలిప్స్ లాంటి డేంజరస్ ఆటగాణ్ని బెంచ్‌కే పరిమితం చేసి.. ఐడెన్ మార్క్‌రమ్ అన్ని అవకాశాలు ఎందుకు ఇస్తూ వచ్చారని మండిపడ్డారు. ప్యాట్ కమిన్స్‌తో పాటు సన్‌రైజర్స్ కోచింగ్ స్టాఫ్‌పై కూడా ఫైర్ అవుతున్నారు. ఫిలిప్స్ తుది జట్టులోకి వచ్చి ఉంటే.. కధ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

ఇది చదవండి: కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..