RR vs PBKS: హఫ్ సెంచరీలతో చెలరేగిన పంజామ్ ఓపెనర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

|

Apr 05, 2023 | 9:59 PM

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయంగా  86 పరుగులు చేయడంతో ఆ టీమ్ 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో టీమ్‌కి శుభారంభం అందించారు. మరోవైపు రాజస్థాన్ తరఫున జేసన్ హోల్డర్ 2 వికట్లు,  ఆర్ అశ్విన్,..

RR vs PBKS: హఫ్ సెంచరీలతో చెలరేగిన పంజామ్ ఓపెనర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?
Rr Vs Pbks
Follow us on

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజామ్ జట్టు భారీ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయంగా  86 పరుగులు చేయడంతో ఆ టీమ్ 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో టీమ్‌కి శుభారంభం అందించారు. మరోవైపు రాజస్థాన్ తరఫున జేసన్ హోల్డర్ 2 వికట్లు,  ఆర్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.  అంతకముందు తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. పంజాబ్ బ్యాటింగ్‌కి ప్రారంభించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్(34 బంతుల్లో 60 పరుగులు ; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్లు ఫోర్లతో చెలరేగాడు. అతనితో పాటు శిఖర్ ధావన్( 56 బంతుల్లో 86 పరుగులు నాటౌట్ ; ఫోర్లు, సిక్సర్) కూడా అద్భుతంగా రాణించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు.

అయితే దూకుడుగా ఆడుతూ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని జేసన్ హోల్డర్ విడదీశాడు. 10వ ఓవర్ వేసిన హోల్డర్ బైలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన సిమ్రన్ సింగ్.. జాస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పడ్డాడు. అనంతరం వచ్చిన భానుక రాజపక్స రిటైర్ హార్ట్‌గా మైదానం నుంచి వెనుదిరిగాడు. దీంతో జితేష్ శర్మ క్రీజులోకి వచ్చి తనకు తగినంతగా దూకుడుతనాన్ని ప్రదర్శించాడు. మరోవైపు ధావన్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా బంతిని బౌండరీ దిశగా పంపాడు. ఈ క్రమంలోనే ధావన్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

కానీ జితేష్ శర్మ దూకుడు ఆటకు యజువేంద్ర చాహల్ బ్రేకులు వేశాడు. 27 పరుగులు చేసిన జితేష్ చాహల్ 16వ ఓవర్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సికందర్ రజాను క్లీన్ బౌల్డ్ చేశాడు రవి అశ్విన్. ఇక షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్‌తో కలిసి శిఖర్ ధావన్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..