IPL 2023: వేలంలో వద్దన్నారు.. ఇప్పుడేమో రమ్మంటున్నారు.. స్టార్ ప్లేయర్లు హ్యాండివ్వడంతో.. వెంటపడుతోన్న ఫ్రాంచైజీలు..
IPL 2023: IPL సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ప్రారంభం కాకముందే స్టార్ ప్లేయర్లు కొన్ని జట్లను విడిచిపెట్టారు. జస్ప్రీత్ బుమ్రా, జే రిచర్డ్సన్ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత, విల్ జాక్స్ ఇప్పుడు ఆర్‌సీబీ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను రూ.3.2 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో కాలికి గాయం కావడంతో జాక్స్ ఇప్పుడు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
విల్ జాక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్‌తో చర్చలు జరిపింది. ఈ వేలంలో రూ. 1 కోటి ధరతో వేలంలోకి వచ్చిన బ్రేస్‌వెల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
విల్ జాక్స్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేసేందుకు ఆర్‌సీబీ ఆసక్తిగా ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఆర్‌సీబీ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా మారింది.
IPL సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో RCB తమ IPL ప్రచారాన్ని ప్రారంభించనుంది.
RCB జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ , వానిందు హసరంగా, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోను యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..