Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ముంబై తరఫున 200 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా కూడా అవతరించాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్లలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ మూడు సీజన్ల తర్వాత 2011లో ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ముంబై తరుపున ఆడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్‌గా 5 సార్లు ముంబైని టోర్నీ చాంపియన్‌గా నిలిపాడు. ఇక నేటి మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు అంతకముందు ఆర్‌సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(251) పేరిట ఉండేది. ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తంగా 252 సిక్స్‌లు కొట్టాడు. అలాగే ఈ జాబితాలో ఆర్‌సీబీ మరో మాజీ ఆటగాడు క్రిస్‌గేల్(357) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్ ఇప్పుడు 3వ స్థానంలో.. చెన్నై టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని(239) నాల్గో స్థానంలో ఉన్నాడు
Milestone ?
2️⃣0️⃣0️⃣ sixes for @ImRo45 in IPL for @mipaltan ?
Follow the Match: https://t.co/o61rmJWtC5#TATAIPL | #MIvGT pic.twitter.com/K731wShPoB
— IndianPremierLeague (@IPL) May 12, 2023
Most sixes in IPL:
357- Chris Gayle
252*- Rohit Sharma
251- AB de VilliersRohit Sharma surpasses AB de Villiers!#RohitSharma #MIvsGT
— CricTracker (@Cricketracker) May 12, 2023
కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో 219 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే కష్టాలను ఎదుర్కొంటోంది. 7 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కొల్పోయి 55 పరుగులతో ఉంది. ఇక క్రీజులో గుజరాత్ తరఫున అభినవ్ మనోహర్(2), డేవిడ్ మిల్లర్(10) ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..