ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవలేకపోయిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ జట్టు మూడుసార్లు ఫైనల్ ఆడినా ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఈ జట్టు చివరిసారిగా 2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్ ఫైనల్ ఆడింది. ఇక గత ఏడాది, కోహ్లి కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ కొనుగోలు చేసి కెప్టెన్‌గా చేసింది. అయితే ప్లేఆఫ్‌కు చేరిన ఆ జట్టుకు ట్రోఫీని అందుకునే భాగ్యం మాత్రం దక్కలేదు. అయితే ప్రతిసారీ లాగానే ఈసారి కూడా ఛాంపియన్‌గా నిలిచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కసరత్తు ప్రారంభించింది. అన్ని ఫ్రాంచైజీలతో పాటు బెంగళూరు తన వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్లార్ ప్లేయర్లను నిలబెట్టుకుంది. అదే సమయంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ తో పాటు అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లవ్నిత్ సిసోడియా, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌లపై వేటు వేసింది.
ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రాడ్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లవ్నిత్ సిసోడియా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.
కాగా కొత్త కెప్టెన్ ఫాఫ్ కెప్టెన్సీలో బెంగళూరు గత సీజన్‌లో బాగా ఆడింది. అందుకే ఈ ఏడాది పెద్దగా మార్పులు చేయలేదు. గత సీజన్‌లో తనతో ఉన్న చాలా మంది ఆటగాళ్లను జట్టు అంటిపెట్టుకుంది. కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసింది. మొదట సిద్ధార్థ్ కౌల్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ గతేడాది RCB తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే టీమ్ సిద్ధార్థ్‌పై నమ్మకం ఉంచి అతన్ని నిలబెట్టుకుంది. డేవిడ్ విల్లీని విడుదల చేసినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఫ్రాంచైజీ విడుదల చేసిన రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలో అతని పేరు కూడా ఉంది. కాగా ప్రస్తుతం ఆర్సీబీ పర్స్‌లో రూ. 8.75 కోట్లు ఉన్నాయి.
Believe in the core!
12th Man Army, here are our ???????? ????? ??????????? who will be a part of RCB’s #Classof2023!#PlayBold #WeAreChallengers pic.twitter.com/aQCnh2K66E
— Royal Challengers Bangalore (@RCBTweets) November 15, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..