గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను అందుకున్న జట్టు.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్ 2022 టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ టీమ్ ముందున్న సవాల్ చాలా పెద్దది. రాబోయే సీజన్‌లో పాండ్యా జట్టు టైటిల్ నిలబెట్టుకోవాల్సి ఉంది. అయితే, దీనికి ఇంకా సమయం ఉంది. అంతకు ముందు, మిగిలిన ఐపిఎల్ జట్ల మాదిరిగానే, గుజరాత్ టైటాన్స్ కూడా తమ ఆటగాళ్లను విడుదల చేసి, రిటైన్ చేసుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ 2023కి ముందు గుజరాత్ టైటాన్స్ 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అలాగే 6 మందిని విడుదల చేసింది. కాగా రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఖరారు చేయడానికి ముందు, ఇద్దరు ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ ద్వారా కేకేఆర్ జట్టులో చేరారు. ఇందులో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్, ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్
రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్
And the ?????? keep marching on… ??#RetentionAnnouncement #AavaDe pic.twitter.com/FiRvi00aHO
— Gujarat Titans (@gujarat_titans) November 15, 2022
గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ 2022 మొదటి సీజన్. కానీ, తొలి సీజన్‌లోనే ఈ టీమ్ అంచనాలకు మించి రాణించింది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ గ్రూప్ దశలో 14 మ్యాచ్‌లు ఆడింది.10 గెలిచింది. నాలుగింటిలో ఓడింది. ఈ జట్టు 2022 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, ఛాంపియన్‌గా నిలిచింది. మరి ఈ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లను రిటైన్, విడుదల చేయడం ద్వారా మొదటి అడుగు వేసింది. డిసెంబర్ 23న జరగనున్న మినీ వేలంలో విడుదలైన ఆటగాళ్లకు బదులు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
AAPDE GT GAYA!
WE ARE THE #IPL Champions 2⃣0⃣2⃣2⃣!#SeasonOfFirsts | #AavaDe | #GTvRR | #IPLFinal pic.twitter.com/wy0ItSJ1Y3
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..